Switch to English

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: వైసీపీ సర్కార్‌కి షాక్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సూట్‌కేసు కంపెనీలు.. వర్సెస్ ఇన్‌సైడర్ ట్రేడింగ్.. ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో ఇదొక ఆసక్తకిరమైన రాజకీయ యుద్ధం. వైఎస్ జగన్ మీద అక్రమాస్తుల కేసు నేపథ్యంలో సూట్‌కేసు కంపెనీల వ్యవహారం తెరపైకొచ్చిన విషయం విదితమే. ‘నీకిది నాకది’ అంటూ అడ్డగోలుగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచేశారన్నది అక్రమాస్తుల కేసుకు సంబంధించి వినిపించిన ఆరోపణలు, అబియోగాల పర్వం తాలూకు సారాంశం.

తనను అలా విమర్శించడంతో వైఎస్ జగన్‌కి చిర్రెత్తుకొచ్చింది.. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ అనే ప్రస్తావన తీసుకొచ్చి, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ అండ్ టీమ్ ఆరోపణలు చేసిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్, ఆ ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కానీ, అసలంటూ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి అవకాశమే లేదని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది.

తాజాగా, ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ సర్కారుకి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారి రాజేష్ మరికొందరు వ్యక్తులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ వాదనల్ని హైకోర్టు కొట్టిపారేసింది. భూములు అమ్మినవారెవరూ ఫిర్యాదు చేయకుండా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణలు చేయడంలో అర్థమేముందని హైకోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. అయితే, చంద్రబాబు హయాంలో అమరావతి పేరుతో భూ దందా జరిగిందన్నది నిర్వివాదాంశం. ఆ సమయంలో చంద్రబాబు సహా అనేక మందిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన వైసీపీ, తాము అదికారంలోకి వచ్చాక మాత్రం చిత్ర విచిత్రమైన రాజకీయాల్ని తెరపైకి తెస్తోంది.

మాజీ మంత్రి నారాయణ ఇటీవలి కాలంలో రాజకీయ తెరపై ఎక్కడా కనిపించడంలేదు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి తీవ్రాతి తీవ్రమైన ఆరోపణల్ని వైసీపీ చేసింది, నారాయణ మీదనే. అధికారంలో ఎవరున్నా అంతిమంగా దోపిడీ అయితే సర్వసాధారణం. ఆయా పార్టీల మధ్య 60-40 ఒప్పందాలే ఇందుక్కారణం. రాజకీయ లబ్ది కోసం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప.. ఆ ఆరోపణపై విచారణ విషయమై అధికారంలో వున్నవారు చూపే చిత్తశుద్ధి నేతి బీరకాయలో నెయ్యి చందమే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....