ప్రముఖ టెక్ దిగ్గజాలు తమ సాప్ట్ వేర్లకు సంబంధించిన లోపాలను గుర్తించేందుకు లక్షల జీతాలు ఇస్తూ ఉద్యోగులను పెట్టుకున్నారు. కాని వారు గుర్తించనివి కూడా చాలా ఉంటాయి. ఇటీవల ఫేస్ బుక్ మెసెంజర్ యాప్‌కు సంబంధించిన ఒక లోపాన్ని వారి టీం మెంబర్స్ కాకుండా గూగుల్‌కు చెందిన ఒక లేడీ ఉద్యోగి కనిపెట్టారు. ఆమె కనిపెట్టిన బగ్ తో మెసెంజర్ లో ఇద్దరి మద్య జరుగుతున్న సంభాషణ మరియు చాటింగ్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు.
ఆ బగ్ హ్యాకర్ల చేతిలో పడితే చాలా నష్టం కలుగుతుంది. వెంటనే ఆ లోపంను సవరించేందుకు ఫేస్ బుక్ కు వీలు కలిగింది. తమ యాప్ లో ఉన్న లోపాన్ని గుర్తించినందుకు గాను గూగుల్ ఉద్యోగినికి 60 వేల డాలర్లను ఫేస్ బుక్ బహుమానంగా ఇచ్చింది. ఇండియన్ కరెన్సీలో 44 లక్షలు అన్నమాట.
ఒక చిన్న లోపంను కనిపెట్టినందుకు ఇంత పెద్ద మొత్తం ఏంటో అనుకుంటున్నారా.. ఫేస్ బుక్ వంటి ప్రముఖ సంస్థకు అది అస్సలు చిన్న విషయం కాదు. లక్ష డాలర్లకు పైగా బహుమానం ఇవ్వాల్సిందే. కాని ఫేస్ బుక్ వారు గూగుల్ ఎంప్లాయి అవ్వడం వల్ల తక్కువ ఇచ్చురు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
733951 213339Its excellent as your other posts : D, regards for posting . 353405