ఒక్కోసారి ఒక్కో మాట చాలా చాలా గట్టిగానే తగిలేస్తుంటుంది. సమాజాన్ని ఆలోచనలో పడేస్తుంటుంది. అలాంటి ఓ మాట, ఓ సినిమా చెప్పబోతోంది. ఫస్ట్ లుక్ ద్వారా ఓ దర్శకుడు ఓ గొప్ప మాటని జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. అతని పేరు దేవ కట్టా. ‘రిపబ్లిక్’ సినిమా అది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా అది.
ఇంతకీ, దర్శకుడు దేవ కట్టా, ‘రిపబ్లిక్’ సినిమాతో ఏం చెప్పబోతున్నాడు.? అంటే, అంతకన్నా ముందు ఫస్ట్ లుక్ ద్వారా అతను ఏం సందేశం పంపాలనుకున్నాడో తెలుసుకోవాలి. ‘డెబ్భయ్ నాలుగేళ్ళుగా ప్రభుత్వం వుందన్న భ్రమలో బతుకుతున్నాం. కానీ, మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా వుంటుందో కూడా తెలీదు’ అన్నది దర్శకుడు చెబుతున్న కీలకమైన విషయం.
ఏదో పబ్లసిటీ కోసం ఈ ‘రాత’ ఫస్ట్ లుక్ మీద దర్శకుడు రాయించాడా.? అన్నది వేరే చర్చ. ప్రస్తుత పరిస్థితులకు ఈ మాట అచ్చంగా సరిపోతుంది. అసలు ప్రభుత్వం ఏంటి.? అన్న విషయమై ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవడం మానేశారు. రాజకీయ పార్టీల సంగతి సరే సరి. అధికారంలో వున్నవాళ్ళు తాము ప్రజలకు సేవ చేయాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ‘ప్రభుత్వం వున్నది వ్యాపారం చేయడానికి కాదు..’ అంటూ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసి, వ్యాపారవేత్తలకు లబ్ది చేకూర్చుతున్న రోజులివి.
అధికారంలోకి రావడమంటే, తమ కులానికి చెందినవారికి అప్పనంగా పదవులు కట్టబెట్టుకోవచ్చన్న భావన రాజకీయ పార్టీల్లో పెరిగిపోయిన దిక్కుమాలిన పరిస్థితులివి. ప్రభుత్వమంటే, ప్రజా ధనాన్ని సంక్షేమ పథకాలతో పప్పు బెల్లంలా పంచడమేనన్న బావనకి ప్రజలు కూడా వచ్చేశారు. అన్నీ ఇంటి దగ్గరకే వచ్చేస్తున్నాయని సంబరపడిపోతున్నారుగానీ, ప్రభుత్వాలు తమని సోమరిపోతుల్లా చూస్తున్నాయన్న కఠోర వాస్తవాల్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు.
ఓటు, పాలన, రాజకీయం.. వంటి అంశాలపై కనీసపాటి బాధ్యత ఓటర్లలో కనిపించడంలేదు. ప్రభుత్వాల్ని ప్రశ్నించడమెప్పుడో మర్చిపోయారు ప్రజలు. కులాల వారీగా పంచాయితీలు నడుస్తోంటే, తదనుగుణంగా భజన చేయడమో.. లేదంటే మనకెందుకీ గొడవ అని నిమ్మకుండిపోవడమో.. ఇదీ వ్యవస్థలో కనిపిస్తోన్న కొత్త పోకడ.
వ్యాపారవేత్తలు రాజకీయాల్ని ఏలితే, వ్యాపారమే జరుగుతుంది.. ప్రజలకు మెరుగైన పాలన ఎలా అందుతుంది.? ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. టిక్కెట్లు అమ్మకుంటున్నాయి, ఓట్లు కొనుక్కుంటున్నాయి.. ప్రజలూ తక్కువేం తిన్లేదు.. ఓటుకు నోటు అందుకుంటున్నారు.. సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. కానీ, దోపిడీకి గురవుతున్నామన్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఇదీ నేటి రాజకీయ భారతం.!
497016 576477Often the Are generally Weight reduction plan is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point sustain a far healthier your life. la weight loss 885660
223938 533251I undoubtedly did not realize that. Learnt one thing new today! Thanks for that. 420925
995941 484566Depending on yourself to make the decisions can genuinely be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes a lot more than just happening to happen. 801883
718147 652232Can you give me some tips for piece of software writing? 513017
917163 991826Fairly uncommon. Is likely to appreciate it for people who contain community forums or anything, internet internet site theme . a tones way for the client to communicate. Excellent job.. 981941
841628 73664I like what you guys are up also. Such intelligent function and reporting! Keep up the superb works guys Ive incorporated you guys to my blogroll. I believe itll improve the value of my internet site . 138529