Switch to English

మన మొహల్లా క్లీనిక్‌లకు మహర్దశ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం రాగానే.. తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటైన మొహల్లా క్లీనిక్‌లకు మొదట్లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. స్థానికులు కనీస వైద్యం కోసం ప్రతిసారీ పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఈ మొహల్లా క్లీనిక్‌లలో కనీస వైద్య వసతులు కల్పించి ఓ డాక్టర్‌, ఓ నర్సును నియమించారు. ఇవి ప్రభుత్వం ఆధ్వర్యలోనే నడుస్తాయి. నిజానికి ఇది చాలా మంచి ప్రయోగం. అయితే వీటిని నిర్వహించడంలో మాత్రం కేజ్రీవాల్‌ ప్రభుత్వం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఈ మొహల్లా క్లీనిక్‌లను ఏర్పాటుచేసిన ప్రాంతాల చుట్టుపక్కల స్వచ్ఛతను పాటించకపోవడం.. కాలానుగుణంగా వసతులు కల్పించడంలో విఫలమవడం కారణంగా మొహల్లా క్లీనిక్‌లు అనుకున్నంత స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఏదేమైనా వీటిని సరైన పద్ధతిలో నిర్వహిస్తే మాత్రం.. ఇదో గొప్ప నిర్ణయం.

ఢిల్లీ సంగతి పక్కనపెడితే.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి క్లీనిక్‌లను గతేడాది ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీంతో మరింత పకడ్బందీగా.. ఈ కేంద్రాల్లో రక్త, మూత్ర పరీక్షలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లుచేయనుంది. బస్తీ దవాఖానాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 341 సర్కార్‌ క్లీనిక్‌లను ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 247, గ్రామీణ ప్రాంతాల్లో 75, కొన్ని జిల్లా కేంద్రాల్లో 11, గిరిజన ప్రాంతాల్లో 8 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బస్తీ దవాఖానాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 చోట్ల నిర్మాణపనులు జరుగుతున్నాయి. మరో 97 దవాఖానాల కోసం ప్రాంతాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలా అలా నడుస్తున్న కొన్ని బస్తీ దవాఖానాల్లో 35 చోట్ల డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ప్రారంభించే యోచనలో కూడా సర్కారు ఉంది. ఈ కేంద్రాల్లో రక్త, మూత్ర పరీక్షలతోపాటుగా.. ఈసీజీ సేవలనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

రాష్ట్రంలో పేదలకు వైద్యసేవలందించే పథకం తీసుకొస్తామంటూ కొంతకాలంగా కేసీఆర్‌ చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని కేంద్రాలు ఇలాంటి ఫార్ములాతో పనిచేస్తున్నప్పటికీ.. వీటి ద్వారా పెద్దగా సేవలు అందడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో, ఇతర కార్పొరేషన్లలో కలిపి 249 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి. అయితే డాక్టర్లతో సేవలందించడం కన్నా.. పెద్దాసుపత్రులకు రిఫరల్‌ కేంద్రాలుగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసి.. మరో 341 కేంద్రాలను కలపడం ద్వారా.. మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్యను 590కి పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాబోయే రోజుల్లో మరిన్ని విస్తరించనున్నారు.

కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానాల్లో మూడు నాలుగు వాటిల్లో స్పెషలిస్టు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాంటిచోట్ల రోగుల నుంచి ఎంతో కొంత రుసుం వసూలు చేయాలని, వాటిని ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానాల్లో ఉదయం, సాయంత్రం వేళలల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. మురికివాడల్లో ప్రతీ చిన్న సమస్యకూ గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు వెళ్లకుండా.. ఇక్కడే చికిత్సనందించే ఏర్పాట్లు చేయనున్నారు. చిన్న చిన్న వైద్య పరీక్షలు కూడా ఇక్కడ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ ఐదేళ్లలో తెలంగాణలో వైద్యవ్యవస్థ పనితీరు అనుకున్నంతగా లేకపోవడంతో తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...