Switch to English

పబ్‌ జీ పాయె.. ఫౌజీ వచ్చె.! ఏ రాయి అయితేనేం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

ఏ రాయి అయితేనేం పళ్ళు ఊడగొట్టుకోవడానికి.. అది ‘పబ్‌ జి’ రాయి కావొచ్చు.. కొత్తగా వస్తోన్న ‘ఫౌజీ’ కావొచ్చు.! అందులో విషయం మాత్రం దాదాపు ఒక్కటే. అయితే, ‘భారతీయత’ అనే పేరుతో కొత్తగా ‘ఫౌజీ’ కోసం పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. ఈ స్టంట్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌.

‘పబ్‌ జీ’ ఆట గురించి కొత్తగా ఎవరికీ పరిచయం చేయాల్సిన పనిలేదేమో. అదొక ఆట మాత్రమే కాదు.. అంతకు మించిన వ్యసనం. ఆయుధాల్ని కొనేందుకు డబ్బులు.. లెవల్స్‌ దాటేందుకు డబ్బులు.. ఇలా చాలా హంగామా వుంటుంది. గెలిస్తే వచ్చేది ‘చికెన్‌ డిన్నర్‌’.. అది కూడా రియల్‌గా కాదు. కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరుగుతోంటే, ఓ మూలన స్మశాన వాటికలో ఆ తతంగాన్ని ఓ పక్క చూస్తూనే ఇంకోపక్క ‘పబ్‌ జీ’లో మునిగితేలుతోన్న కుర్రకారు వున్నారంటే.. అది అతిశయోక్తి కాదు.. కఠోర వాస్తవం. పబ్‌ జి అనే ఆటకి ఏ స్థాయిలో కుర్రాళ్ళు బానిసలైపోయారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

‘ఫౌ జీ’ అనే ఆట ఏకంగా ‘సైనిక దళాల గొప్పతనాన్ని చాటేస్తుంది’ అని చెబుతున్నాడు అక్షయ్‌కుమార్‌. నిజమేనా.? అంటే, అది ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఈ తరహా ఆటల ఉద్దేశ్యం ఒకటే. యువత మనసుల్లోకి చొచ్చుకుపోవడం.. వారి ఆలోచనల్ని ఇంకో లోకంలోకి తీసుకెళ్ళిపోయి.. ‘ఆటకి బానిసలుగా’ మార్చేయడం.

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ నినాదానికి సంబంధించి మా వంతుగా ఈ ప్రయత్నమంటూ అక్షయ్‌కుమార్‌ ఈ రోజు ఈ ‘ఫస్‌ జీ’ ఆటని అనౌన్స్‌ చేసేశాడు. పేరులో ఫౌజి వున్నంతమాత్రాన.. సైనికుల పట్ల యువతలో గౌరవం పెరిగేంత గొప్పదనం ఈ యాప్‌లో వుందని ఎలా ఆశించగలం.? దీని ద్వారా పెద్దయెత్తున ‘సంపాదన’ ఆర్జించాలన్నదే రూపకర్తల ఆలోచన అయి వుంటుంది తప్ప, దేశోద్ధారణ కార్యక్రమాన్ని వారి నుంచి ఆశించలేం.

అన్నట్టు, ఈ ఆట ద్వారా సమకూరే మొత్తంలో 20 శాతం ‘భారత్‌ కా వీర్‌ ట్రస్ట్‌’కి అందజేస్తారట. అంటే, యువత బలహీనతల్ని సొమ్ము చేసుకుని.. తద్వారా వచ్చిన సొమ్ముల్లోంచి కొంత మొత్తాన్ని దానం చేసేస్తారన్నమాట. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. అప్పుడు చైనావోడు.. ఇప్పుడేమో మనోడే.. మన యువతని దోచేయబోతున్నాడహో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....