151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగానీ.. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలున్న తెలుగుదేశం పార్టీగానీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిలదీయలేకపోతున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ – బీజేపీ మిత్రపక్షాలు. అప్పట్లో వైసీపీ, తెరవెనుకాల బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడేమో బీజేపీకి జనసేన తప్ప మిత్రపక్షాలేమీ లేవు. కానీ, తెరవెనుకాల మాత్రం టీడీపీ, వైసీపీ మద్దతిస్తున్నాయి. ఇదేమి రాజకీయ చిత్రమోగానీ.. ఈ వైపరీత్యం రాష్ట్రానికి శాపంగా మారుతోంది.
‘అడగనిదే అమ్మయినా పెట్టదు’ అని వెనకటికి ఓ నానుడి వుండేది. ఆ లెక్కన, ఏ విషయంలో అయినా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి కదా. జనసేన ఎటూ బీజేపీ మిత్రపక్షం గనుక.. తనవంతుగా కేంద్రానికి కొన్ని వినతులు చేస్తోంది. కేంద్రం, వాటిల్లో కొన్నిటిని సానుకూలంగా పరిశీలిస్తోంది, కొన్ని సందర్భాల్లో జనసేన ఆలోచనల్ని ముందుకు తీసుకెళుతోంది కూడా.
మరి, రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ ఏం చేస్తోంది.? తెరవెనుకాల కేంద్రానికి మద్దతిస్తోందిగానీ.. ఏ విషయమ్మీద కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతోంది. విద్యుత్ సంస్కరణల్నే తీసుకుంటే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేయమని కేంద్రం ఆదేశించింది. దాన్ని, వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడు వైఎస్ జగన్ తు.చ. తప్పకుండా పాటించేస్తున్నారు.. దానికి మళ్ళీ నగదు బదిలీ పథకం అనే కొత్త పేరు పెట్టి. ఇక, ఈ అంశంపై కేంద్రాన్ని ప్రతిపక్షంగా నిలదీయాల్సిన చంద్రబాబు, తనకేమీ సంబంధం లేదన్నట్లు లైట్ తీసుకున్నారు.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని.. ఇలా చాలా విషయాలపై వైసీపీ, టీడీపీ ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయాలని కేంద్రం కోరితే, తెలంగాణ రాష్ట్రం ససేమిరా అనేసింది. ఆ పాటి తెగువ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేకపోవడం ఆశ్చర్యకరమే.
ఇక, జీఎస్టీ విషయమై రాష్ట్రాలకు కేంద్రం మొండిచెయ్యి చూపితే కేసీఆర్, సరాసరి ప్రధానికి లేఖాస్త్రం సంధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడా నోరు మెదపడంలేదు. ట్విట్టర్లో ప్రతి చిన్న విషయానికీ హడావిడి చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాలపై స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరం. అంశాల వారీగా కేంద్రానికి రాష్ట్రం మద్దతివ్వొచ్చుగాక.. కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే ఎలా.?
91139 169527Any way Im going to be subscribing for a feed and I hope you write-up again soon 869099
16387 608202I real glad to discover this web internet site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 826111
666655 880126There is noticeably a great deal of funds to comprehend this. I suppose you made particular nice points in functions also. 968653