Switch to English

అటకెక్కిన రుణమాఫీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

నిజానికి చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ప్రస్తావించని అంశం రైతు రుణమాఫీనే. ఇంకా రైతులకు పూర్తిగా ఇవ్వని కారణంగా బాబు గట్టిగా రైతలును ఓట్లు ఆడగలేకపోయారు. అసలు ఆ విషయం ప్రస్తావించడానికే ఆయన ఇష్టపడలేదు. సంపూర్ణంగా కాకపోయిన ప్రకటించిన విధంగా మరో రెండు విడతలు రైతులకు ఇవ్వవలసి ఉంది. గత వారంరోజుల నుంచి రుణమాఫీ వేస్తున్నాను తీసుకోండి అన్న చంద్రబాబు కేవలం నోటి మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇంతవరకూ బ్యాంకులకు సదరు డబ్బులు జమకాలేదు. కేవలం అన్నధాత సుఖీభవ కింద మొదట వెయ్యి, తరువాత 3వేల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి. రుణమాఫీ ఖచ్చితంగా ఎన్నికల లోపు వేస్తారని రైతులు భావించారు. కానీ అదికాస్తా అటకెక్కింది.

ఎమ్మెల్యేల ఆశ నీరుగారిపోయింది..

టీడీపీ ఎమ్మెల్యేలు ఈదఫా ఎక్కువగా ఆశ పెట్టుకుంది.. డ్వాక్రా, పసుపుకుంకుమ, వృద్ధాప్య ఫెన్షన్‌, రైతు రుణమాఫీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏ పల్లెల్లోకి వెళ్లినా ఎక్కువగా రైతు రుణమాఫీ మీదే నిలదీసేవారు. కానీ చంద్రబాబు హామీతో ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి.. ఇక తమకు రైతులు గంపగుత్తగా ఓట్లు వేస్తారని ఆశించిన వారి ఆశలు అడియాసలే అయ్యాయి. రుణమాఫీ అంశం చెప్పినమాట ప్రకారం చేశాం మాకు ఓట్లు వేయండి అని అడగడానికి లేకుండా పోయింది. ఏతావాతా ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం నడిసముద్రంలో నావాలాగా అయిపోయింది.

టీడీపీకి ఇది మాయని మచ్చ..

తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది మాయని మచ్చగా నిలిచిపోనుంది. ఎన్నికల ముందు సంపూర్ణ రుణమాఫీ అని ప్రకటించిన ఆ పార్టీ.. ఆ తరువాత అనేక రకాల కొర్రీలు వేసినా లక్షన్నర వరకూ అయినా ప్రయోజనం కలుగుతుంది అనుకున్నారు. వాటిని కూడా 5 విడతలుగా ఇస్తామని ప్రకటించారు. మూడు దఫాలు ఇచ్చినా చివరి రెండు దఫాలు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఖజనా అంతా ఇప్పటికే ఖాళీ అయిపోయింది. ఇక వచ్చేవి కూడా ఇప్పట్లో లేకపోవడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది.

ఈనెల కేంద్రం నుంచి రావలసిన జీఎస్టీ సొమ్ములు అంతా వచ్చిన వెంటనే ఉద్యోగుల జీతాలు, డ్వాక్రా, అన్నదాతా సుఖీభవ తదితర వాటికి పూర్తిగా సర్దేశారు. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉన్న సమయంలో చంద్రబాబు ఖచ్చితంగా 8వతేదీ కంతా రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి తీసుకోండి అని చెప్పారు. తీరా రైతులు బ్యాంకుల వద్దకు వెళితే అలాంటిది ఏమిలేదని సెలవిస్తున్నారు. కొన్ని బ్యాంకులు ఈ తాకిడిని తట్టుకోలేక బయట బోర్డులు కూడా పెడుతున్నాయట. రైతులకు సంబంధించి ఎలాంటి డబ్బులు తమకు జమకాలేదని దయజేసి రైతులు ఎవ్వరూ కూడా బ్యాంకు వద్దకు రావద్దని బోర్డులు పెడుతున్నారు.

ఆచరణ సాధ్యం కానీ హామీ అని జగన్‌ ఆ హామీని ఇవ్వలేకపోయాడు. నేను చేసి చూపిస్తా అని చంద్రబాబు బీరాలకు పోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన ప్రధానా హామీలో రుణమాఫీ ఆచరణ కానీ హామీగా మిగిలిపోనుంది. ఇది ఎన్నటికీ అధికార పార్టీకి మాయని మచ్చలాగే మిగిలిపోనుంది. ఇక ప్రచార పర్వం కూడా నిన్నటితో ముగిసిపోవడంతో.. జనం నాడి ఎటు మొగ్గుతుంతో వేచి చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...