Switch to English

ఇకపై సరికొత్తగా ఫేస్ బుక్.. నో లైక్ బటన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ను మరింత కొత్తగా మార్చడానికి ఆ సంస్థ సిద్ధమైంది. ఫేస్ బుక్ పేజ్ లే అవుట్ లో కీలక మార్పులు చేయబోతోంది. అలాగే కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించబోతోంది. దీంతో ఇకపై ఫేస్ బుక్ తన వినియోగదారులకు సరికొత్త అనుభూతిని పంచనుందని సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ పర్సనల్ ప్రొఫైల్, పబ్లిక్ పేజ్ ల మధ్య అనుసంధానం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు ఇంటర్ ఫేస్ రీడిజైన్ చేస్తోంది.

అలాగే ఫేస్ బుక్ పేజీ నడిపేవాళ్లు తమ ఫాలోవర్స్ తో సంభాషిస్తూ వారి మధ్య జరిగే చర్చలో నేరుగా పాల్గొనే అవకాశం కూడా రానుంది. ఇక మరో కీలకమైన మార్పు ఏమిటంటే.. లైక్ బటన్ తొలగించడం. ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఇతరులు నిర్వహించే పేజీలకు లైక్ కొట్టడం కుదరదు. ఈ మేరకు పేజ్ లైక్ బటన్ తొలగిస్తున్నారు. దానికి బదులు ఆ పేజీని ఫాలో కావడం ద్వారానే దానికి సంబంధించిన అప్ డేట్స్ పొందడం కుదురుతుంది.

ఫాలోవర్స్ ను బట్టే ఆ పేజీ పాపులారిటీ నిర్ధాస్తారు. అయితే, కొందరు ముందుగా ఆ పేజీని లైక్ చేసి, తర్వాత ఫాలో అవుతున్నారు. అనంతరం ఆ పేజీ నచ్చకపోతే అన్ ఫాలో చేస్తున్నారు. డిస్ లైక్ చేయడంలేదు. దీంతో ఆ పేజీ లైక్స్, ఫాలోవర్స్ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో లైక్ బటన్ తొలగించాలని ఫేస్ బుక్ నిర్ణయించింది.

అలాగే పేజ్ మేనేజ్ మెంట్ యాక్సెస్ లోనూ కొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఇన్ సైట్స్, యాడ్స్, కంటెంట్, మెసేజెస్ వంటివాటిని నిర్వహించేందుకు అడ్మిన్ యాక్సెస్ ఇవ్వబోతోంది. దీనివల్ల సదరు పేజ్ కు కొత్త అడ్మిన్ లను యాడ్ చేయడం, ఇన్ సైట్ అనుమతులు ఇవ్వడం కుదురుతుంది. ఇక నకిలీ వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు మరో ఫీచర్ తీసుకొస్తోంది. వెరిఫైడ్ పేజ్ లకు ఇచ్చే బ్లూ కలర్ బ్యాడ్స్ మరింత బాగా కనబడేలా మార్పులు చేస్తోంది. దీనివల్ల వెరిఫైడ్ పేజ్ నుంచి అభ్యంతరకర సందేశాలు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని భావిస్తోంది.

అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫీచర్ కూడా రానుంది. దీని ద్వారా పేజ్ క్రియేటర్లు, ఫాలోవర్ల నుంచి నేరుగా సమాధానాలు స్వీకరించే అవకాశం ఉంది. వాణిజ్య అవసరాలకు పేజీ నడిపేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ పేర్కొంది. త్వరలోనే ఈ మార్పులు అందుబాటులోకి రానున్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...