Switch to English

ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూ: ప్రేమ పెళ్లి గొప్పది, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటా: నిధి అగర్వాల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సవ్యసాచి మరియు మిస్టర్‌ మజ్ను చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో సక్సెస్‌ దక్కించుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలను చేస్తున్న ఈ అమ్మడు ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?

ప్రస్తుతం నా సొంత ప్రాంతం అయిన బెంగళూరులో అమ్మానాన్నతో కలిసి ఉన్నాను. సాదారణంగా ముంబయిలో ఉండే నేను లాక్‌డౌన్‌ కారణంగా అమ్మానాన్నలతో బెంగళూరులో ఉంటున్నాను.

ఈ లాక్‌డౌన్‌లో మీరు ఏం చేశారు?

నేను ఎక్కువగా మెడిటేషన్‌ చేశాను. ఇదే సమయంలో డాన్స్‌ ఇంకా తెలుగు తమిళం భాషలను నేర్చుకునేందుకు శ్రద్ద పెట్టాను. ఇక నెట్‌ ప్లిక్స్‌లో ఎక్కువగా వెబ్‌ సిరీస్‌లు చూడటంతో పాటు సినిమాలు కూడా చూశాను.

ఈమద్య కాలంలో మీరు చూసిన బెస్ట్‌ షో ఏంటీ?

మనీ హెస్ట్‌ మరియు డార్క్‌.

గల్లా అశోక్‌తో నటిస్తున్న సినిమాకు మీరు డబ్బింగ్‌ చెప్పుకునే అవకాశం ఉందా?

నిజంగా నాకు డబ్బింగ్‌ చెప్పడం అంటే చాలా ఇష్టం. నేను నటించిన పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పుకుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మొదటి మూడు సినిమాలకు నాకు ఆ అవకాశం రాలేదు. త్వరలో నా సినిమాలకు డబ్బింగ్‌ చెప్తాను.

గల్లా అశోక్‌తో వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఎలా ఉంది?

కొత్త వాడైనా కూడా అతడికి నటనపై చాలా పట్టు ఉంది. ఏం చేయాలో ఏం చేస్తున్నాడో అతడికి బాగా క్లారిటీ ఉంటుంది. అన్ని విషయాల్లో బాగా ట్రైనింగ్‌ అయ్యాడు. అశోక్‌తో వర్క్‌ ను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను.

సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి జుంబారే పాటకు డాన్స్‌ వేయడం ఎలా అనిపించింది?

ఆ పాటను చాలా ఎంజాయ్‌ చేశాము. ఒరిజినల్‌ను మ్యాచ్‌ చేసేందుకు చాలా ప్రయత్నించాం. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు.

మీ కొత్త ప్రాజెక్ట్‌ గురించి చెప్పండి?

ప్రస్తుతం గల్లా అశోక్‌తో సినిమా చేస్తున్నది తెలిసిందే. జయం రవితో తమిళంలో ఒక సినిమాను చేశాను. అది విడుదల కావాల్సి ఉంది. తెలుగు మరియు తమిళంలో కొన్ని సినిమాలు చర్చలు జరుగుతున్నాయి.

అల్లుడు అదుర్స్‌ సినిమాలో బెల్లంకొండ కోసం ఐటెం సాంగ్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. దానిపై మీ స్పందన ఏంటీ?

ఆ రూమర్స్‌ ఎలా వచ్చాయో నాకు తెలియదు. నేను ఆ సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడం లేదు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఎంటర్‌ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారా?

తప్పకుండా, స్క్రిప్ట్‌ బాగుంటే తప్పకుండా వెబ్‌ సిరీస్‌లో నటిస్తాను. ఇప్పటికే కొన్ని చర్చలు జరుగుతున్నాయి.

మీరు ప్రేమలో ఉన్నారా?

లేదు

మీరు ప్రేమ వివాహంకు వెళ్తారా? పెద్దలు కుదర్చిన వివాహం చేసుకుంటారా?

ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే నేను మాత్రం తల్లిదండ్రుల సూచన మేరకు పెళ్లి చేసుకుంటాను. వారు నా కోసం మంచి అబ్బాయిని ఎంపిక చేస్తారనే నమ్మకం ఉంది.

అక్కినేని బ్రదర్స్‌తో వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఎలా ఉంది?

ఇద్దరు కూడా మంచి నటులు. వారి పని వారు చూసుకుంటారు. ఇద్దరికి కూడా చాలా పోలికు ఉన్నాయి. చాలా డిసిప్లేన్‌గా సెట్‌లో ఉంటారు. ఇద్దరు కూడా అద్బుతమైన వ్యక్తిత్వం ఉన్న వారు.

మీరు ఎవరితో నటించాలని కోరుకుంటారు?

రణ్‌బీర్‌ కపూర్‌

మీరు ఏ డైరెక్టర్‌ తో వర్క్‌ చేయాలనుకుంటున్నారు?

మణిరత్నం

మీ డ్రీమ్‌ రోల్స్‌?

సూపర్‌ హీరో సినిమాలు చేయాలనుకుంటున్నాను. యాక్షన్‌ సినిమాలంటే నాకు ఇష్టం.

ఇతరులు చేసిన ఏ పాత్ర అయినా మీకు చేయాలని అనిపించిందా?

నాకు అలా ఏమీ లేదు. కాని మహానటి చిత్రంలో కీర్తి సురేష్‌ నటన బాగుంది. ఆ సినిమా నాకు బాగా ఇష్టం.

ఇప్పటి వరకు మీరు చేసిన పాత్రల్లో ఏది ఛాలెంజింగ్‌గా అనిపించింది?

నా మొదటి సినిమానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను.

మంచి డాన్సర్‌ అయిన మీరు రామ్‌ ఇంకా టైగర్‌ ష్రాఫ్‌ తో నటించారు కదా. వారిలో ఎవరితో డాన్స్‌ చేయడంకు ఇబ్బంది పడ్డారు?

ఇద్దరు కూడా మంచి డాన్సర్స్‌. ఇద్దరిలో ఎవరితో కూడా డాన్స్‌ చేయడానికి ఇబ్బంది పడలేదు. అయితే ఇద్దరితో కూడా డాన్స్‌ చేయడంను ఎంజాయ్‌ చేశాను. నేను చాలా నేర్చుకున్నాను.

మీరు డాన్స్‌ చేసిన పాటల్లో బెస్ట్‌ సాంగ్‌ ఏది?

ఇస్మార్ట్‌ శంకర్‌ నుండి దిమాక్‌ కరాబ్‌

ఇప్పటి వరకు మీరు వర్క్‌ చేసిన దర్శకుల్లో బెస్ట్‌ డైరెక్టర్‌ ఎవరు?

పూరి జగన్నాధ్‌ సర్‌. ఆయనతో వర్క్‌ చేయడం నిజంగా గొప్ప విషయం. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను.

బాలీవుడ్‌కు మళ్లీ తిరిగి వెళ్లిపోయే ప్లానింగ్‌ ఉందా?

తప్పకుండా, మంచి ఆఫర్లు వస్తే మంచి పాత్రలతో దర్శకులు సంప్రదిస్తే తప్పకుండా బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తాను. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్‌ చర్చలు కూడా జరుగుతున్నాయి.

టాలీవుడ్‌లో మీకు గట్టి పోటీ ఎవరని భావిస్తున్నారు?

ప్రతి ఒక్కరిని కూడా పోటీగా భావిస్తాను. అయితే నాకు నేను పోటీగా భావిస్తాను. ఇతరుల కంటే బెటర్‌ అంటూ నిరూపించుకునేందుకు నేను ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను.

టాలీవుడ్‌లో మీ అభిమాన హీరో హీరోయిన్‌ ఎవరు?

పవన్‌ కళ్యాణ్‌ గారు అంటే ఇష్టం. ఆయన సింప్లీ సూపర్‌. ఇక హీరోయిన్స్‌ లో సమంత, కాజల్‌, నయనతార.

బాలీవుడ్‌కు టాలీవుడ్‌కు పెద్ద తేడా ఏంటని మీరు భావిస్తున్నారు?

(నవ్వు) బాలీవుడ్‌ సెట్స్‌లో పోహా టిఫిన్‌గా పెడతారు, టాలీవుడ్‌ సెట్స్‌లో ఇడ్లీ ఇంకా దోశ పెడతారు. అంతకు మించి తేడా ఉంటుందని నేను భావించడం లేదు.

ఇండియాలో బెస్ట్‌ డాన్సర్‌ అనుకుంటున్నారు?

హృతిక్‌ రోషన్‌

సుశాంత్‌ రాజ్‌ పూత్‌ గురించి ఏమైనా చెప్తారా?

మేమిద్దరం మంచి స్నేహితులం. ఆ విషయం తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. దిల్‌ బేచారా ట్రైలర్‌ చూసి కన్నీరు పెట్టుకున్నాను. అతడు ఎక్కడ ఉన్నా శాంతితో ఉండాలని కోరుకుంటున్నాను.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...