ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా రాజకీయాలు మాత్రం నిత్యం వేడివేడిగానే ఉంటాయి. అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ తమ పార్టీని ఎలా దెబ్బ తీసిందో, ఇప్పుడు అదే తరహాలో తాము కూడా టీడీపీని దెబ్బకొట్టాలని వైసీపీ అడుగులు వేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నేరుగా పార్టీలో చేర్చుకోకుండా టీడీపీకి దూరం చేసే వ్యూహం అవలంభిస్తోంది. ఇప్పటికే పలువురిని అలా పార్టీకి దూరం చేసిన అధికార పార్టీ పెద్దలు.. ఆ దిశగా మరింతగా దృష్టి సారించినట్టు చెబుతున్నారు.
వైసీపీలోకి వచ్చే టీడీపీ నేతలు ఇంకా చాలామంది ఉన్నారని, అందులో మాజీ మంత్రి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మాజీ మంత్రి అంటే నారాయణ అయ్యి ఉండొచ్చనే విశ్లేషణలు సాగుతున్నాయి. కానీ వైసీపీలోకి ఆయన రాక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయంలో సంప్రదింపులు జరిగినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ కొన్ని కారణాలరీత్యా జగన్ అందుకు అంగీకరించలేదని సమాచారం.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణపై వైసీపీ చాలా ఆరోపణలు చేసింది. అమరావతి పేరుతో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రాంతంలో భారీగా భూములు దక్కించుకున్నారని ఆయనపై గతంలో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. దీంతోనే నారాయణ విషయంలో అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రాజధాని భూ కుంభకోణంపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నారాయణను పార్టీలో చేర్చుకుంటే అతి తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
ఒకవేళ విచారణలో నారాయణ పాత్ర నిజమేనని తేలితే అది వైసీపీకే ఇబ్బందికరం అవుతుంది. అందువల్లే నారాయణ చేరికకు గ్రీన్ సిగ్నల్ రావడంలేదని తెలుస్తోంది. రాజధాని భూకుంభకోణంపై విచారణ పూర్తయి, అందులో నారాయణ పాత్ర లేకుంటే అప్పుడు ఆయన చేరికపై ఆలోచించొచ్చనే భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత నారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొన్న దాఖలాలు లేవు.
946439 883966Very good job on this article! I genuinely like how you presented your facts and how you created it fascinating and easy to comprehend. Thank you. 972263
153047 521333Hmm is anyone else encountering problems with the pictures on this weblog loading? Im trying to figure out if its a problem on my finish or if its the weblog. Any responses would be greatly appreciated. 463485
581812 56001Perfectly composed content , thankyou for entropy. 664973