తెలుగుదేశం పార్టీ అత్యద్భుతంగా ఓ వెలుగు వెలుగుతున్న రోజులవి. అనూహ్యంగా టీడీపీలో కొత్త వింత పరిణామాలు చోటు చేసుకుంటున్న కాలమది. చంద్రబాబు తర్వాత ఎవరు.? అన్న చర్చ వచ్చిన ప్రతిసారీ, ఫలానా నాయకుడు నెంబర్ టూ.. అన్న వాదన వినిపించేది. అలా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి.. కొద్ది రోజులు మాత్రమే టీడీపీలో వుండేవారు. ఆ తర్వాత పార్టీకి దూరమవడమో, శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపోవడమో జరిగేది. ఈ లిస్టులో ఎలిమినేటి మాధవరెడ్డి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.
టీడీపీలో నెంబర్ టూ.. అన్న పొజిషన్ సొంతం చేసుకున్న నేతల్లో మాధవరెడ్డితోపాటు దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి.. ఓ దశలో కేసీఆర్.. ఇలా చాలా పేర్ల గురించి చెప్పుకుంటుంటారు. ‘నెంబర్ టూ’ అనే పొజిషన్ వచ్చిందంటే, పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందేనేమో.. ఆ వ్యక్తిమీద అనుమానాలు, ఆనక అవమానాలు.
ఈ అంశాల గురించిన చర్చ ఇప్పుడెందుకంటే, తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. విజయరామారావుని తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు వదిలించుకుంది.? ఆలె నరేంద్ర ఎందుకు గులాబీ పార్టీకి దూరమయ్యారు.? విజయశాంతి పరిస్థితేంటి.? చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు కూడా పెద్దదే. తాజాగా ఈటెల రాజేందర్ వికెట్ పడింది. చూస్తోంటే, చంద్రబాబు బాటలోనే కేసీఆర్ కూడా పయనిస్తున్నట్టున్నారు.
ఓ దశలో హరీష్ రావు పేరు నెంబర్ టూ.. అని వినిపించిందిగానీ, ఆయన తెలివిగా తప్పించుకున్నారు. కాదు కాదు, తెలివిగా ఆయన్ని తప్పించారు.. చివరికి ఆయన పార్టీలో సర్దుకుపోయారు. కొన్నాళ్ళ క్రితం హరీష్ అభిమానులు చేసిన యాగీ గురించి అందరికీ గుర్తుండే వుంటుంది. తమ అభిమాన నేతకు గౌరవమివ్వడంలేదంటూ గులాబీ పార్టీపై గులాబీ శ్రేణులే గుస్సా అయ్యాయి. ఈటెల వికెట్ పడింది.. ఇప్పుడు ఈటెల మీద గట్టిగా విరుచుకుపడుతున్నవారి వికెట్ కూడా త్వరలోనే పడిపోనుందన్న చర్చ ప్రముఖంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది.
ఇంతకీ ఆ వికెట్ లేదా వికెట్లు.. ఎవరివబ్బా.? కేసీఆర్ కుటుంబానికి చెందినవైతే ఖచ్చితంగా కానే కావు. కుటుంబ సభ్యులకేమో పదవులు.. ఇతరులకేమో అవమానాలు.. అనే చర్చకూడా జరుగుతోందండోయ్ గులాబీ పార్టీ గురించి.
620268 961758Oh my goodness! a fantastic post dude. Thanks Nonetheless My business is experiencing concern with ur rss . Do not know why Struggling to join it. Is there anybody getting identical rss problem? Anyone who knows kindly respond. Thnkx 511156
81567 438498I gotta favorite this website it seems handy very helpful 939214