మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంతగా చెబుతున్న గ్రేటర్ జనాలకు ఎక్కడంలేదు. మీదారి మీదే.. మా దారి మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన మందుబాబులు భారీగానే పట్టుబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీసులు తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కా మార్చిలోనే ఏకంగా 2,049 మంది మందుబాబులు ఈ తనిఖీల్లో దొరికిపోయారు. వీరిలో ముగ్గురికి కోర్టు 9 రోజుల జైలు శిక్ష విధించగా.. మరో 10 మందికి వారం రోజుల శిక్ష విధించింది. మరో 45 మందిలో కొందరికి ఐదు రోజులు, మరికొందరికి రెండు రోజుల జైలుశిక్ష పడింది. మరో 14 మందిపై కేసు విచారణ జరుగుతోంది.
ఇక ఈ తనిఖీల్లో పట్టుబడిన 1917 మంది నుంచి రూ.1.99 లక్షల జరిమానా వసూలు చేశారు. మరో 132 మందిపై కేసు నమోదు చేయాల్సి ఉంది. ఈ గణాంకాలన్నీ కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించినవి మాత్రమే. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇందులో కలపలేదు. మద్యం తాగి వాహనాలు నడిపినవారందరినీ గోషామహల్, బేగంపేటల్లోని కౌన్సెలింగ్ కేంద్రాలకు రావాలని పోలీసులు సూచించారు. ఇక సైబరాబాద్ మార్చి 27నుంచి ఏప్రిల్ 2 వరకు 74 మంది మందుబాబులు దొరికారు. వారికి కోర్టు రూ.2.44 లక్షల జరిమానా విధించింది.
520083 833663Absolutely nothing much better than Bing finding us a great web site related to what I was seeking for. 144139
320721 42112A truly fascinating read, I may possibly nicely not agree totally, but you do make some quite legitimate factors. 949076
242807 678108I believe this internet internet site contains extremely superb composed articles posts . 905326
511613 961845Hi. Cool write-up. Theres an problem along with your web site in firefox, and you might want to check this The browser may be the market chief and a great section of people will pass more than your great writing because of this problem. 891413
379147 886088I definitely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 308909