Switch to English

డాక్టర్‌ శిల్ప డెత్‌ మిస్టరీ: ఆ డాక్టర్లకు మళ్ళీ పోస్టింగ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

2018లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన డాక్టర్‌ శిల్ప డెత్‌ మిస్టరీ కేసుకి సంబంధించి ఏ2, ఏ3 నిందితులుగా వున్న ఇద్దరు డాక్టర్లకు ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వైద్య కళాశాల ప్రొఫెసర్ల లైంగిక వేధింపులే యువ డాక్టర్‌ శిల్ప ఆత్మహత్యకు కారణమంటూ అప్పట్లో విద్యార్థి సంఘాలు గళం విప్పాయి. మహిళా సంఘాలు కదం తొక్కాయి. ఈ క్రమంలో రాజకీయ రచ్చ కూడా జరిగింది. ‘ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య..’ అంటూ విపక్షాలూ మండిపడ్డాయి.

వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న జవహర్‌రెడ్డి తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు సదరు డాక్టర్లకు తిరిగి పోస్టింగ్‌ ఇస్తూ జీవోపై సంతకం చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. లైంగికవ వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులకు వివాదాస్పద రీతిలో తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడమేంటన్న ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది. డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసులో డాక్టర్‌ కిరిటీ, డాక్టర్‌ శశికుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఆ ఇద్దరికీ ప్రస్తుతం ఎస్వీ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ మరియు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పోస్టింగ్స్‌ ఇవ్వడం గమనార్హం.

డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసులో సీఐడీ విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితులుగా వున్న ఇద్దరు డాక్టర్లకు పోస్టింగులు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. అయితే, కుటుంబ సమస్యలే శిల్ప ఆత్మహత్యకు కారణమనీ, తమకూ ఆ ఆత్మహత్య ఘటనకూ సంబంధం లేదని డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శివకుమార్‌ చెబుతున్నారు. ఏదిఏమైనా, వివాదాస్పద అంశాల విషయంలో ప్రభుత్వం కాస్త సంయమనం పాటించాల్సి వుందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

మొత్తమ్మీద, చంద్రబాబు హయాంలో తప్పు.. అన్నది, ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ హయాంలో ‘ఒప్పు’ అయిపోతోంది. టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి వ్యవహారంలో వైసీపీనే ‘చంద్రబాబ బినామీ’ ఆరోపణలు చేసి, ఆ వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆయన్ని తిరిగి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపిక చేసిన విషయం విదితమే. రాజకీయాలంటే ఇలాగే వుంటాయ్‌.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...