Bigg Boss 7: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchi babu) దర్శకత్వంలో RC16 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss telugu 7) కంటెస్టెంట్ అంబటి అర్జున్ అవకాశం దక్కించుకున్నారు. అది కూడా దర్శకుడు బుచ్చిబాబు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం ద్వారా. వివరాల్లోకి వెళ్తే..
దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి బుచ్చిబాబును ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున. ఈ సందర్భంగా అర్జున్ ఆటను మెచ్చుకున్నారు బుచ్చిబాబు. ‘బుచ్చి అన్నా.. నాకోసం వచ్చినందుకు థ్యాంక్స్. ఉప్పెనకు అవార్డు వచ్చాక 2-3సార్లు మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నించా. ఫోన్ చేద్దామన్నా కుదరలేదు. ఈలోపు ఇక్కడికి వచ్చాన’ని అన్నారు. దీంతో అర్జున్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు బుచ్చిబాబు.
‘రామ్ చరణ్ సర్ సినిమాలో సూపర్ క్యారెక్టర్ చేయబోతున్నావ్.. ఫిక్స్ అయిపో’ అంటూ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. దీంతో అర్జున్ ఆనందంలో మునిగిపోయాడు. ఈక్రమంలోనే RC16కి ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నారని బుచ్చిబాబు ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు.