Switch to English

ప్రచారంలో ఒక్కొక్కరూ.. ఒక్కోలా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రమే పుల్ స్టాప్ పడింది. దాదాపు మూడు వారాలుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఇక ఓటరు తన తీర్పును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేయడమే మిగిలి ఉంది. ఈ మూడు వారాల్లో జరిగిన ప్రచారం గతంలో ఎన్నడూ లేనంత ఉదృతంగా సాగింది. మొదటి విడతలోనే రాష్ట్రంలో ఎన్నికలు ఉండటం.. అందుకు సన్నద్ధం కావడానికి సరిగా సమయం లేకపోవడం వంటి కారణాలతో నేతలు సుడిగాలిలా రాష్ట్రాన్ని చుట్టేశారు. ఎక్కడికక్కడ రోడ్ షోలతో జనంతో మమేకమయ్యారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో దూసుకెళ్లారు. ఆయనకు మద్దతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రచారం చేశారు. ఇక వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుడిగాలి ప్రచారంతో రాష్ట్రాన్ని చుట్టేశారు. పాదయాత్ర ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను కవర్ చేసిన ఆయన.. తాజాగా ఎక్కడికక్కడ రోడ్ షోలతో హోరెత్తించారు. ఆయనకు తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల తోడ్పాటుగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కూడా ప్రచారంలో కదం తొక్కారు. రాష్ట్రం మొత్తం కాకపోయినా, తాము లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు.

అయితే, ఈసారి ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త దూకుడుగా వెళ్లారు. ప్రతి సభలోనూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భాల్లో కొన్నిసార్లు పరుష వ్యాఖ్యలు కూడా చేశారు. మోదీ, కేసీఆర్ లకు జగన్ ఊడిగం చేస్తున్నారని పలుమార్లు ఆరోపణలు చేశారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడినైన తాను ఓ నేరస్తుడితో పోటీ పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మోదీ మనల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. ఇక చివరి రోజు సభలో అయితే మరింత ఉధృతి పెంచారు. మోదీకి జగన్, కేసీఆర్ లు పెంపుడు కుక్కలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఓటేసినట్టేనని.. ఆత్మగౌరవం చంపుకునే ఇలాంటి పనులు చేయొద్దంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ లక్ష్యంగానే విమర్శలు చేశారు. అడపాదడపా టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. కానీ ఎక్కడా చంద్రబాబును నేరుగా ఆయన విమర్శించలేదు. ఇది ఒకవిధంగా పవన్ కు నష్టం చేకూర్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. వ్యక్తిగతంగా ఎక్కడా విమర్శలు చేయకపోయినా, ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మొత్తమ్మీద త్రిముఖ పోరు నెలకొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఎవరికి ఓటేయాలో ఓటరు ఇప్పటికే ఓ నిర్ణయానికి కూడా వచ్చాడు. ఇక ఈవీఎం మీట నొక్కడమే తరువాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...