మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ధమాకా ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. క్రాక్ తర్వాత మళ్ళీ రవితేజ అంత ఎనర్జిటిక్ గా నటించిన చిత్రం ధమాకా.
ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేయగా బెజవాడ ప్రసన్న కుమార్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్ కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక రేపు విడుదల కానున్న ధమాకా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ధమాకా టీమ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు టీమ్.
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన వివేక్ కుచిభోట్లా, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు భీమ్, దేవాలయాన్ని సందర్శించి చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.
118906 431406I truly delighted to locate this internet web site on bing, just what I was looking for : D too saved to fav. 477688
415631 125138I admire your work , regards for all the beneficial blog posts. 564284