Switch to English

దర్బార్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మహేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

రజనీకాంత్ అంటే హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్! రజనీకాంత్ లో క్లాసు.. మాసు… బాసు… హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్సు… ఒకేసారి చూపిస్తే? ‘దర్బార్’ మోషన్ పోస్టర్!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గజిని, స్టాలిన్, తుపాకీ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ పోలీస్ అధికారి అరుణ్ అరుణాచలం పాత్రలో నటిస్తున్నారు. గురువారం సాయంత్రం ‘దర్బార్’ మోషన్ పోస్టర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

“రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనంటే నాకు ఎప్పటికీ అభిమానం, గౌరవం ఉంటాయి. దర్శకుడు మురుగదాస్ గారికి, మిగతా చిత్ర బృందానికి నా అభినందనలు” అని మహేష్ బాబు అన్నారు.

‘దర్బార్’ మోషన్ పోస్టర్ లో రజనీకాంత్ ప్రతినాయకులపై కత్తి దూసే దృశ్యానికి అభిమానుల నుండి అద్భుత స్పందన లభిస్తోంది. అందులో రజనీ స్టైల్, మాస్ అప్పీల్ అందరిని ఆకట్టుకుంటుంది. రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ రజినీకాంత్ రాయల్ లుక్, మోషన్ పోస్టర్ ట్రెండింగ్ టాపిక్.

రజనీకాంత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర తారాగణం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయ్.: పేర్ని నాని జోస్యం.!

ఎన్నికల ఫలితాల వెల్లడికి జస్ట్ వారం రోజులు మాత్రమే మిగిలి వుంది. కౌంటింగ్ రోజున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.? అన్నదానిపై అనుమానాలు పెరుగుతున్నాయంటే కారణం వైసీపీనే.! వైసీపీ నేత, ఎమ్మెల్యే,...

పవన్ కళ్యాణ్ మెజార్టీపై వైసీపీలో పందేలు.!

పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి.. పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలి.! పవన్ కళ్యాణ్ చట్ట సభల్లోకి అడుగు పెట్టకూడదు.! ఇదీ వైసీపీ వ్యూహం.! అందుకే, గాజువాక అలాగే భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ మోహరింపు ఓ...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో చెప్పిన బన్నీ..

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ ఇటివల తీసుకున్న ఓ నిర్ణయంపై చర్చ...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి UAE గోల్డెన్ వీసా.. ప్రత్యేకతలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. UAE దేశానికి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా (Golden Visa) అందించింది. దక్షిణాది చిత్ర...