Switch to English

సెన్సేషనల్‌ డైరెక్టర్‌పై కమెడియన్‌ చెత్త కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

శంకర్‌ అంటే ఓ సంచలనం. తమిళ దర్శకుడు శంకర్‌ పాపులారిటీ కేవలం తమిళ సినిమాలకే పరిమితం కాలేదు. దేశం గర్వించదగ్గ దర్శకుడతడు. భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో ఖచ్చితంగా శంకర్‌ పేరు ముందు వరుసలోనే వుంటుంది. అలాంటి గొప్ప దర్శకుడికి అసలు దర్శకత్వమే రాదని ఓ కమెడియన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ వైరల్‌ కాకుండా ఎలా వుంటుంది? పైగా, ఇప్పుడా కమెడియన్‌, సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల సోషల్‌ మీడియాని ఓ కుదుపు కుదిపేసిన ‘నేసమని’ హ్యాష్‌ట్యాగ్‌ గుర్తుంది కదా! అది వడివేలు కారణంగానే అంత పాపులర్‌ అయ్యింది.

ఎప్పుడో చాలాకాలం క్రితం వడివేలు నటించిన ఓ సినిమాలోని సన్నివేశం అనూహ్యంగా వైరల్‌ అయ్యింది. ‘నేసమని’కి ఏమయ్యింది? ‘నేసమని త్వరగా కోలుకోవాలి’ అంటూ హ్యాష్‌ ట్యాగ్స్‌ పుట్టుకొచ్చాయి. ఇంత పాపులారిటీ వచ్చాక వడివేలు ఊరుకుంటాడా? తన నోటికి పని చెప్పాడు. అదీ సంచలన దర్శకుడు శంకర్‌ మీద. ఎంత సంచలన దర్శకుడైనా అతనికీ కెరీర్‌లో బ్యాడ్‌ ఫేజ్‌ రావొచ్చు కదా! అదే జరుగుతోందిప్పుడు. ఆయన ఏది పట్టుకున్నా అది ‘మట్టిగొట్టుకుపోతోంది’ ఇటీవలి కాలంలో. రజనీకాంత్‌తో ‘2.0’ సినిమా చేస్తే, అదీ అంచనాల్ని అందుకోలేకపోయింది. అంతకుముందు విక్రమ్‌తో ‘ఐ’ చేస్తే, దాని పరిస్థితీ అంతే. కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు-2’ మొదలు పెట్టాడుగానీ, ఇదీ అనేక వివాదాల కారణంగా ఆగిపోయింది.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన, శంకర్‌ నెత్తిన వడివేలు వ్యాఖ్యలు పిడుగులా పడ్డాయి. ఒకప్పుడు వడివేలు – శంకర్‌ మధ్య సన్నిహిత సంబంధాలే వుండేవి. ఆ సంబంధాలతోనే వడివేలు హీరోగా శంకర్‌ నిర్మాణంలో ఓ సినిమా వచ్చింది. శంకర్‌ తన శిష్యుడి దర్శకత్వంలో ఆ సినిమాని నిర్మించాడు. అదే ‘హింసించే రాజు పులికేశి’. అది పెద్ద విజయాన్ని అందుకుందిగానీ, అసలు ఆ సినిమాకి సింపుల్‌ లైన్‌ మాత్రమే దర్శకుడిదనీ, మిగతా భాగమంతా తానే చేసుకున్నాననీ వడివేలు తాజాగా ప్రకటించాడు.

వాస్తవానికి వడివేలు కెరీర్‌ అంత గొప్పగా ఏమీ లేదిప్పుడు. కొత్త తరం కమెడియన్లతో వడివేలు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ టైమ్‌లో వడివేలు, వివాదాస్పద వ్యాఖ్యలతో స్టార్‌డమ్‌ తెచ్చుకోవాలనుకుంటున్నట్లు కన్పిస్తోంది. లేకపోతే, శంకర్‌ని విమర్శించే స్థాయి వడివేలుకి వుందని ఎవరైనా అనుకోగలరా?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...