పరిపాలన వికేంద్రీకరణపై వెనకడుగు వేయమని.. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని అసెంబ్లీలో వికేంద్రీకరణపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు లేదని హైకోర్టు చెప్పడం తన పరిధి దాటిందని అనిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం.. చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉంది. రాజధానిపై కేంద్రం అనుమతులు తీసుకోవాలని చెప్పిన కోర్టు.. అదే కేంద్రం రాజధానిపై తుది నిర్ణయం రాష్ట్రానిదే అని చెప్పింది. నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని కోర్టు చెప్పడం కరెక్ట్ కాదు’.
‘రాజధాని అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది కేంద్రం. పైగా హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కేంద్రం కొట్టేసింది. గత ప్రభుత్వం రాజధానిని అటు గుంటూరు ఇటు విజయవాడ కాకుండా తమ బినామీలకు భూములున్న చోట పెట్టారు. ఆ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ఘన విజయం చేకూర్చారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది. ఈ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా’.
‘హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజధానిపై చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది శాసన సభా? లేదా కోర్టులా? అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. . హైకోర్టుపై గౌరవం ఉంది. రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. రాజధానితోపాటు రాష్ట్ర సంక్షేమం కూడా మాకు ముఖ్యం. న్యాయ సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణను ఓ కొలిక్కి తెస్తాం. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తూ వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయం. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఇచ్చిన మాటలన్నింటికి కట్టుబడి ఉన్నాం
150375 300279hi there, your site is discount. Me thank you for do the job 56537
6218 570027whoa, this is a truly very good piece of information. I read about something like this before, this is impressively wonderful stuff. 472190
818572 871285Most heavy duty trailer hitches are developed using cutting edge computer aided models and fatigue stress testing to ensure optimal strength. Share new discoveries with your child and maintain your child safe by purchasing the correct style for your lifestyle by following the Perfect Stroller Buyers Guideline. 339460