Chiranjeevi: అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నిర్మాతలుగా తెరకెక్కించిన సినిమా “మంగళవారం” (Mangalavaram). మెగాస్టార్ చిరంజీవి ఆన్ లైన్ ద్వారా ట్రైలర్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి.. పరిశ్రమలోకి యువత రావాలని.. ముఖ్యంగా మహిళలు వివిధ శాఖల్లోకి వస్తూ తమ ప్రతిభను చాటుకోవడం తనకెంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ఈమేరకు చేసిన పోస్టులో..
‘స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజకి మంచి స్నేహితురాలు. యువత, ముఖ్యంగా యంగ్ విమెన్ పరిశ్రమలోని వివిధ శాఖల్లోకి ప్రవేశించడం ఆసక్తిగా వుంటుంది. కొత్త ఆలోచనలు, ఎనర్జీతో ఫిల్మ్ మేకింగ్, మార్కెటింగ్ లకి కొత్త డైరెక్షన్ ఇవ్వగలరు’.
‘అజయ్ భూపతిలాంటి టాలెంటెడ్ దర్శకుడితో యంగ్ స్టర్ స్వాతిరెడ్డి తొలి ప్రయత్నంగా ‘మంగళవారం’ సినిమా నిర్మించడం సంతోషం. గ్రామీణ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు.
‘మంగళవారం’ సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజ కి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లో కి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 21, 2023