మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా.. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఇది ప్రేక్షకలను అలరించనుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.
వాల్తేరు వీరయ్య చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 8న ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను బుల్లితెరపై కూడా చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఓ టీవీ షోలో పాల్గొంటున్నారు. టాప్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న కొత్త టీవీ షో ‘సుమ అడ్డా’లో చిరంజీవి కనిపించనున్నారు. ఈ షోకు చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ కూడీ హాజరవుతున్నారు.
ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్‌ను త్వరలోనే టెలికాస్ట్ చేసేందుకు షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. అయితే బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ ప్రోగ్రాంను హోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి ఆయన బుల్లితెరపై కనిపిస్తుండటంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
268462 308220Wow, incredible weblog structure! How lengthy have you ever been blogging for? you made running a weblog look simple. The full appear of your site is wonderful, effectively the content! 543224
186324 914070I enjoy your function , regards for all of the informative posts . 608223