Switch to English

జగన్ బాటలో చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అదేంటి..? జగన్ పేరు వింటేనే అంతెత్తున మండిపడే చంద్రబాబు ఆయన బాటలో వెళ్లడం ఏమిటా అని అనుకుంటున్నారా? రాజకీయాల్లో అంతే మరి. అధికారం చేజిక్కించుకోవాలంటే బోలెడు ఫీట్లు చేయాల్సిందే. అనుక్షణం ప్రత్యర్థులు వ్యూహాలను తెలుసుకుని అంతకుమించిన ఎత్తులతో వాటిని చిత్తు చేస్తేనే అధికారం అందలం ఎక్కిస్తుంది. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారం చేజార్చుకున్ జగన్.. అనంతరం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పథకాలు, ప్రచారం విషయంలో బాగా వెనకబడ్డామనే విషయాన్ని గుర్తించి ఆ మేరకు దృష్టి సారించారు.

ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) అధినేత ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకున్నారు. ఆయనకు దాదాపు రూ.300 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో జగన్ నిర్ణయాన్ని అందరూ విమర్శించారు. కానీ జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఆయనకు అధికారం తీసుకురావడానికి దోహదపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పథకాల రూపకల్పన దగ్గర నుంచి ప్రచారాన్ని విస్తృతంగా చేయడంలోనూ, నియోజకవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ ను తెప్పించుకుని విశ్లేషణ చేయడంలోనూ పీకే టీం అదరగొట్టింది. చంద్రబాబు తన అనుభవాన్ని, అనుకూల మీడియానే నమ్ముకున్నారు.

చివరి నిమిషంలో ప్రకటించిన పథకాలు తనకు ఓట్లు తెచ్చి పెడతాయని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. బాబును చిత్తుగా ఓడించిన జనం.. జగన్ కు అధికారం కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో బాబు కూడా జగన్ బాటే పట్టారు. తాను కూడా ఓ ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నారు. ఐప్యాక్ లో గతంలో పని చేసిన రాబిన్ శర్మ అనే వ్యక్తిని చంద్రబాబు ఇందుకు నియమించుకున్నట్టు సమాచారం. రూ.50 కోట్లకు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.

ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగా పీకే బృందాన్ని జగన్ నియమించుకోగా.. చంద్రబాబు మాత్రం ఏకంగా ఐదేళ్ల ముందే వ్యూహకర్తను నియమించుకోవడం విశేషం. నిర్ణీత షెడ్యూల్ కంటే రెండేళ్ల ముందే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాల నేపథ్యంలో బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అప్పట్లో పీకేను జగన్ నియమించుకున్నప్పుడు ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఏమంటారో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...