మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను అసభ్యపదజాలంతో దూషించి, వారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈమేరకు కేసు వివరాలను డీఎస్పీ వి.ఎన్.కె.చైతన్య తెలిపారు. ఇటివలి తాడిపత్రి ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపై పోలీసులు కేసులు నమోదు చేసి 144 సెక్షన్ విధించారు.
అయితే.. తాము ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రభాకర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో, జూటూరు గ్రామంలోని ఫామ్ హౌస్‌లో దివాకర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులపై దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తమను అసభ్య పదజాలంతో దూషించారని సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో దివాకర్‌రెడ్డిపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ చైతన్య తెలిపారు.
963400 7589Thanks so much for another post. I be able to get that kind of data info. friend, and exactly. 907656
802140 626573You wouldnt feel it but Ive wasted all day digging for some articles about this. You might be a lifesaver, it was an excellent read and has helped me out to no end. Cheers! 711084
557529 929317I view something genuinely unique in this web site . 453354