Switch to English

BroTheAvatar: ‘బ్రో’ నిర్మాత దమ్మున్నోడు.! ‘పవర్’ వున్నోడు కూడా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

BroTheAvatar: సాధారణంగా నిర్మాతల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే తటపటాయిస్తుంటారు. సినిమా రంగం అంటే అద్దాల మేడ. ఎవరు ఏ చిన్న రాయి వేసినా, నష్టం చాలా ఎక్కువగా వుంటుంది. వీలైనంత వరకు వివాదాల జోలికి వెళ్ళడానికి ఇష్టపడరు.

ఒకవేళ ఏదన్నా వివాదం వచ్చినా.. ప్రచారం కోసం వివాదాలు సృష్టించినా.. వెంటనే చల్లారిపోయేలా జాగ్రత్తపడుతుంటారు. ప్రభుత్వాలకు ఎదురెళ్ళడం… అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది సినీ పరిశ్రమ నుంచి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ‘బ్రో’ సినిమా నిర్మాతను బెదిరిస్తోంది. భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంతే కాదు, ఏకంగా సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చేసింది. మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారంటే, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వార్నింగులానే చూడాలి.

‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో వివాదం నడిచింది. అప్పట్లో, నిర్మాత దిల్ రాజు.. అక్కడో మాట.. ఇక్కడో మాట చెప్పడం చూశాం. ‘భీమ్లానాయక్’ విషయంలో వివాదం వచ్చినా.. వెంటనే సద్దుమణిగిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇప్పుడేమో, ‘బ్రో’ సినిమా వివాదం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరకూ వెళుతోంది. ఇదెక్కడి పైత్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు మంత్రి అంబటి రాంబాబు తీరుని చూసి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఏ నిర్మాతా మీడియా ముందుకు రారు.

కానీ, ‘బ్రో’ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ రూటే సెపరేటు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, లీగల్ ఫైట్ అంటూ మొదలు పెడితే, ‘కిందికి లాగేస్తా’నంటూ మంత్రి అంబటి రాంబాబుకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాదు, ‘గాలి మాటల్ని పట్టించుకోదలచుకోలేదు.. నాకు వేరే పనులున్నాయ్.. నేను బిజీగా వున్నాను..’ అంటూ మంత్రి అంబటి రాంబాబు గాలి తీసేశారు.

ఎంత గట్స్ వుంటే.. ఇలా మాట్లాడగలుగుతారు టీజీ విశ్వ ప్రసాద్.! లెక్కలన్నీ పక్కాగా వున్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదన్నది ఆయన వాదన. అందులోనూ నిజం లేకపోలేదు. ‘ఈడీకి మంత్రి ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుంది.? ఈడీ గనుక విచారణ చేపడితే, సహకరిస్తాం.. వివరాలు అందిస్తాం.. భయపడేదేముంది ఇందులో.?’ అనేశారు విశ్వప్రసాద్.

ఇదిలా వుంటే, పరువు నష్టం దావా అంశాన్ని టీజీ విశ్వప్రసాద్ పరిశీలిస్తున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి అంబటి రాంబాబు గనుక ఇంకాస్త ముందుకెళ్ళి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, తరువాత టీజీ విశ్వ ప్రసాద్ యాక్షన్ షురూ చేస్తారు. ‘లీగల్‌గా మేం చాలా స్ట్రాంగ్.. మాది రాయలసీమ..’ అని ఆల్రెడీ ఆయన ఓ మాట ప్రకటించేసి వున్నారాయె.

అన్నట్టు, ‘బ్రో’ సినిమాని డిజాస్టర్‌గా కొంతమంది పేర్కొంటోంటే, సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు టీజీ విశ్వ ప్రసాద్. ‘పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేసింది. అన్ని చోట్లా బయ్యర్స్ కూడా హ్యాపీ. ఇప్పుడు వస్తున్నవన్నీ లాభాలే..’ అని విశ్వప్రసాద్ చెప్పడం కొసమెరుపు.

ఏదిఏమైనా, అభిమాన హీరో కోసం అండగా నిలబడే ఇలాంటి నిర్మాత దొరకడం ఏ హీరోకి అయినా గర్వకారణమే.! పవన్ కళ్యాణ్‌కి విశ్వప్రసాద్ లాంటి నిర్మాత అభిమాని కావడం.. చాలా చాలా గొప్ప విషయం. విశ్వ ప్రసాద్ దమ్మున్నోడు.. అంతే కాదు, ‘పవర్’ వున్నోడు కూడా.! విశ్వ ప్రసాద్ కాకుండా ఇంకెవరైనా నిర్మాత అయి వుంటే, ‘బ్రో’ డిజాస్టర్.. అనే దుష్ప్రచారమే నిజమయ్యేది. వైసీపీ మంత్రుల బెదిరింపులు.. బ్లాక్‌మెయిలింగ్ వరకూ వెళ్ళేవని అభిమానులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...