Switch to English

‘మిషన్‌ 16’కు బ్రేకులు పడతాయా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలంగాణలోని 17ఎంపీ సీట్లలో రాజకీయం రసవత్తరంగా మారింది. మొదట పోరు ఏకపక్షమేననుకున్నా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చాలా మార్పులు కనబడుతున్నాయి. ఒక్క సీటును మిత్రపక్షమైన మజ్లిస్‌కు వదిలిన టీఆర్‌ఎస్‌ మిగిలిన 16 స్థానాలు తమవేనంటూ ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సుడిగాలి ప్రచార పర్యటనల్లోనూ ఇదే అంశాన్ని పదేపదే చెబుతున్నారు. 16 మనవే. సందేహం లేదని కార్యకర్తలు, నేతలకు భరోసా కల్పిస్తున్నారు.

16 సీట్లిస్తే దేశాన్ని గడగడలాడిస్తామని.. ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెబుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా 16 గెలిస్తే కేంద్రం మెడలు వంచుతామని రోడ్‌షోల్లో చెబుతున్నారు. మొదట్నుంచీ 16 సీట్లే టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ ప్రచారం ప్రారంభించింది. కానీ.. పార్టీ అంతర్గత సర్వేల్లో పదహారు కాస్త తగ్గి పన్నెండు, పదమూడు మధ్య ఊగిసలాడుతున్నట్లు సమాచారం. అందుకే.. పరిస్థితి చేయిదాటొద్దని భావించిన సీఎం.. హుటాహుటిన పార్టీ అంతర్గత సర్వేలో 16 సీట్లను గతంలో ఎన్నడూలేని మెజార్టీతో గెలుస్తున్నామని వెల్లడైందంటూ మరోసారి ప్రకటించాల్సి వచ్చింది.

ఇంతకీ టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలుస్తుందా? పరిస్థితి ఆ పార్టీకి 100% అనుకూలంగా ఉందా? నామినేషన్లు వేసేంతవరకు ఈ ప్రశ్నలకు అవుననే సమాధామే వచ్చింది. కానీ ఒక్కసారి నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక క్షేత్రస్థాయిలో అసలు సినిమా మొదలైందని తెలుస్తోంది. 88 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌కు 12 ఎంపీ సీట్లు గెలవడం సులభమే. కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తర్వాత బలాన్ని వందకు పెంచుకుంది. ఆ లెక్కలు వేసుకునే 16సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నా.. గ్రౌండ్‌ లెవల్లో సీన్‌ వేరోలా ఉంది.

టీఆర్‌ఎస్‌ ‘మిషన్‌ 16’ లెక్కను తగ్గించే అవకాశమున్న నియోజకవర్గాల వారిగా పరిస్థితులను గమనిస్తే.. నిజామాబాద్‌లో 185 నామినేషన్లు దాఖలవడం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా రైతులు తీసుకున్న పెద్ద ముందడుగే. అసెంబ్లీ ఎన్నికల వరకు కనిపించని ఈ వేడి.. ఆ తర్వాత ఊపందుకుంది. పసుపుబోర్డు, ఎర్రజోన్నకు మద్దతు ధర కోసం రైతులు రెండు నెలలుగా రోడ్లపై ధర్నా చేసినా పట్టించుకోకపోవడం. నిజామాబాద్‌కు ర్యాలీగా బయలుదేరితే అమానుషంగా లాఠీచార్జీ చేయడం వంటివి మీడియాలో చూపించకపోయినా ప్రజల్లో ముఖ్యంతా రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దీని ప్రభావం ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుంది.

చేవెళ్ల విషయానికి వస్తే.. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరినా ఆయనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. ఎంపీగా ఆయన చేసిన కార్యక్రమాలు.. స్వతహాగా ఎన్నికల్లో భారీగా ఖర్చుకుపెట్టుకునే సామర్థ్యం ఉన్నందున చేవెళ్లలో ఆయన్ను ఓడించడం అంత సులభం కాదని తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌లో డీకే అరుణకు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేతగా ఉన్న జితేందర్‌ రెడ్డి బీజేపీలో చేరి మద్దతివ్వడంతో అక్కడ కమలదళం బలం పెరిగింది. ఇది గెలిచేంతగా ఉంటుందా? అనేది పక్కాగా చెప్పకపోయినా.. టీఆర్‌ఎస్‌కు అంత సులువేం కాదనేది బహిరంగ సత్యమే. ఖమ్మం విషయానికొస్తే.. ఇక్కడ టీఆర్‌ఎస్‌లోనే మూడు, నాలుగు వర్గాలున్నాయి. పైకి కనబడకపోయినా వీరిమధ్య పరిస్థితి ఉప్పు-నిప్పులాగే ఉంది. మొన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్నవారంతా ఒక పార్టీలో చేరి నామా నాగేశ్వరరావును గెలిపించేందుకు కృషిచేస్తారంటే 100% నమ్మలేం.

దీనికితోడు గిరిజన ఓట్లు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్‌లోనూ తుడుందెబ్బ నాయకుడిగా సోయం బాపూరావు (బీజేపీ అభ్యర్థి)కు మంచి ఆదరణ ఉంది. ఇవన్నీ ఓట్లుగా మారి.. ప్రజల్లో మార్పువస్తే.. టీఆర్‌ఎస్‌ కలగంటున్న మిషన్‌ 16ను చేరుకోవడం కష్టమే. ఇది టీఆర్‌ఎస్‌ నేతలకు, కేసీఆర్‌కూ తెలుసు. అయితే హీనపక్షంలో 10 సీట్లయినా గెలిస్తేనే కేంద్రంలో తమ మాటకు విలువ ఉంటుందనే లక్ష్యంతో 16 గెలుస్తామని ప్రతిసభలోనూ కేసీఆర్‌ చెబుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...