Switch to English

Brahmanandam Birthday Special: బ్రహ్మానందం కామెడీ.. బ్రహ్మీ మీమ్స్.. రోజు గడిచేది వీటితోనే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

Brahmanandam: ‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నారు దర్శకుడు జంధ్యాల. సున్నితమైన హాస్యానికి కేరాఫ్ అడ్రెస్. అటువంటి జంధ్యాల ఓ వ్యక్తిలో హాస్యం, హావభావాలు గమనించి తెలుగు తెరపై రామబాణంలా వదిలితే గురి తప్పుతుందా..? తెలుగు ప్రజల మనసుల్లో ఆ బాణం బలంగా గుచ్చుకుని దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అలుపెరగకుండా నవ్విస్తూనే ఉంది. ఆయన్ను చూస్తే పెదాలపై నవ్వు.. కళ్లలో వెలుగు.. మనసులో చక్కిలిగింతలు. ఆయనే ‘బ్రహ్మానందం’. పాత్రతో సంబంధం లేదు.. తెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వు గ్యారంటీ. మన జీవితాల్లో సినిమా ఒక భాగం అంటారు.. కానీ, బ్రహ్మానందం మన మనసుల్లో భాగం. ఎందుకంటే ఆయన మన నవ్వు.. మనశ్శాంతి. నేడు ఆ నవ్వుల రేడు పుట్టినరోజు.

సినిమాలో బ్రహ్మానందం ఎక్కడా..?

బ్రహ్మానందం లేని సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ.. ఈ ‘సినిమాలో బ్రహ్మానందం లేడే..’ అనే మాటలు కూడా వచ్చేవి. ఎందుకంటే.. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా బ్రహ్మానందం కోసం చూడటం ఓ అలవాటు. అంతగా ప్రేక్షకుల్ని నవ్వించారు. మాట.. హావభావాలతో నవ్వించడం ఆయన ప్రత్యేకత. సైలెన్స్ అనే మాట తప్ప సినిమా అంతా మాట్లాడకుండా ‘వినోదం’లో పంచిన వినోదం.. ఖాన్ తో గేమ్స్ ఆడకు, నెల్లూరు పెద్దారెడ్డి, భట్టు, జిలేబి, కిల్ బిల్ పాండే.. ఇలా ఎన్నెన్నో పాత్రలతో ఆయన నవ్వులు పంచారు. జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ.. ఓ తరహా కామెడీ రప్పిస్తే.. త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, వినాయక్, శ్రీను వైట్ల మరో రేంజ్ లో ఆయన్నుంచి కావాల్సినంత హాస్యం రాబట్టారు. ఒక రకంగా దర్శక, రచయితలకే బ్రహ్మానందం సవాల్ విసిరారని చెప్పాలి.

సోషల్ మీడియా కింగ్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో బ్రహ్మానందం తన హవా చూపిస్తున్నారు. ప్రతి సెల్ ఫోన్లో ఆయనే. ఆయన ఫొటో, క్లిప్, మీమ్ తో తెల్లారాల్సిందే.. నవ్వాల్సిందే.. రోజు గడవాల్సిందే. ‘మీమ్ గాడ్’ బ్రహ్మానందం అనే పేరు సోషల్ మీడియాలో మోగిపోతోందంటే సినిమాలు తగ్గించుకున్నా ఆయన హవా ఏంటో తెలుస్తుంది. తెలుగు సినిమాపై రేలంగి, రాజబాబు తర్వాత అంతటి రేంజ్ సంపాదించింది ఒక్క బ్రహ్మానందమే. నా నుంచి ప్రజలకు ఇంతటి నవ్వులు పంచుతున్న మీకు ధన్యవాదాలు.. అని మీమర్స్ ను ఉద్దేశించి అన్నారు బ్రహ్మానందం. ఆయన కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టవు మరి. బ్రహ్మానందం మరిన్ని కామెడీ పాత్రలతో అలరించాలని.. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...