Switch to English

ఇందూరులో ఇదీ సంగతి..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలంగాణ ఎన్నికల కు సమయం సమీపిస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు యావత్ తెలంగాణ దృష్టంతా నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గంపైనే కేంద్రీకృతమై ఉంది. కేసిఆర్ కూతురు కవిత బరిలో ఉండడం ఇందుకు మొదటి కారణం అయితే.. 179 మంది రైతులు సహా మొత్తంగా 185 మంది బరిలో ఉండటంతో యావత్ భారతం దృష్టిని ఇందూరు నియోజకవర్గం బాగా ఆకర్షిస్తోంది. నామినేషన్లు వేసినప్పటినుంచి.. మారుతున్న పరిస్థితుల కారణంగా టీఆర్ఎస్ పై అంచనాలు ప్రజల్లో రోజురోజుకు తగ్గిపోయాయి. రైతుల వ్యతిరేకత, వివిధ వర్గాల్లో అసంతృప్తి కారణంగా కవిత ఓడిపోతారని ప్రచారం ఊపందుకుంది.

దీనికి తోడు కొన్ని ఊళ్లకు ఊళ్లే కవితకు ఓటు వేయమంటూ బహిరంగంగానే చెప్పేశాయి. దీనికి తోడు బీసీ అభ్యర్థులైన బీజేపీ అభ్యర్థి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ లపై అంచనాలు పెరిగాయి. అయితే ఓటమి తప్పదని తెలిసిన నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్.. సామ, దాన, భేద, దండోపాయాలను అమలు చేస్తున్నారు. వీటిని కూడా ప్రత్యర్థులు సరైన రీతిలో తిప్పి కొడుతుండటంతో.. గెలిచేందుకు టీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వ్యూహంతోనే వ్యతిరేకతను కనబడకుండా కవర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అదే ఓటరు జాబితాలో అక్రమాలు. ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించడం.. తమకు కలిసొచ్చేందుకు దొంగఓట్లను జాబితాలో చొప్పించడం. ఇదంతా ఎన్నికల సంఘం అధికారులకు తెలియకుండా జరిగే వ్యవహారమైతే.. కాదు. ఓటరు కార్డులను జారీచేసేది కూడా తమ ఆధీనంలోని ప్రభుత్వ ఉద్యోగులే. ఇంకే ఈ తతంగమంతా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగింది. తప్పకగెలవాల్సిన నిజామాబాద్లో అయితే ఊహించరాని స్థితిలో పాతుకుపోయింది. దీని ఫలితమే.. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో 1.25లక్షల దొంగఓట్లు బట్టబయలు కావడం. ఓటరు లిస్టులో ఓటర్ల పేర్లు చూస్తే.. ఏ స్థాయిలో ఈ దొంగఓట్లను చేర్పించారో తెలుసుకుని అవాక్కవడం ఖాయం.

నిజామాబాద్ నియోజకవర్గంలో రైతుల ఓట్లు చాలా కీలకం. నిజామాబాద్ టౌన్లో.. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ పదవిని మజ్లిస్ పార్టీకి ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికలోనూ.. కలిసి పనిచేయాలని మజ్లిస్-టీఆర్ఎస్ నిర్ణయించుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభావం.. ఓట్ల బదిలీ చాలా స్పష్టంగా కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ముస్లిం ఓట్లు టిఆర్ఎస్ కి విజయవంతంగా బదిలీ అవుతాయనడంలో.. సందేహం లేదు.

అయితే ఉన్న ఓట్లు బదిలీ అయితే అది ప్రజాస్వామికమే. కానీ.. అక్రమంగా ఓటర్ల జాబితాలో ఒకవర్గం ఓట్లను ఉద్దేశపూర్వకంగా చేర్చడంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 22న ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం.. నిజామాబాద్ తో పాటు తెలంగాణ లో ముస్లింల ఓట్లు ప్రభావితంగా ఉన్న ప్రాంతాల్లో.. ముస్లిం మహిళల పేర్లతో.. లక్షల సంఖ్యలో బినామీ ఓట్లు నమోదయ్యాయి. దీనిపై మీద పార్టీలు చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. కానీ ఈ వోట్లను తొలగించడం లో ఎటువంటి ప్రయత్నం కూడా ఎన్నికల సంఘం వైపు నుంచి జరగలేదు. ఇది సుస్పష్టం. గత ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు గల్లంతవడం.. వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో.. కొత్త ఓట్లు పుట్టుకురావడం వంటి దుర్మార్గపూరిత చర్యలన్నీ ఈసీకి తెలియకుండానే జరుగుతాయా అనే ప్రశ్న లేవనెత్తుతున్నాయి.

ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా 16 స్థానాల్లో గెలుస్తామంటూ టీఆర్ఎస్ చెప్పడం వెనక కూడా ఈ వ్యూహం మరోసారి బలంగా పనిచేస్తుందనే అనుమానం తలెత్తుతోంది. ఎందుకు ముస్లిం మహిళల ఓట్లు వివాదాస్పదం అనే ప్రశ్నకు సమాధానం.. పోలింగ్ ఏజెంట్లు గా పని చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బురఖా వేసుకుని ఓటేసేందుకు వచ్చిన మహిళను నీ మొహం చూయించమ్మా.. ఒకసారి ధ్రువీకరించుకుంటామంటే.. పెద్ద రచ్చ జరిగిన సందర్భాలు ఎన్నో. తీసుకొచ్చిన ఓటర్ కార్డుకి ఓటేయడానికి వచ్చిన వ్యక్తికి సంబంధం ఉందా లేదా అని ధ్రువీకరించుకులేని స్థితిలో పోలింగ్ ఆఫీసర్లు ఏజెంట్ పనిచేయాల్సి వస్తుంది.

ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉండే బూతుల్లో అయితే ఏజెంట్ ఏపార్టీవాడయినా మాట్లాడేందుకు కూడా అవకాశం కూడా ఉండదు. దీంతో బురఖా వేసుకుని వచ్చి దొంగ ఓట్లు వేసి వెళ్లేవాళ్లకు లెక్కు ఉండదు. ఎన్నికల తరువాత హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో డ్యూటీ చేసిన ఎందరో పోలింగ్ ఆఫీసర్లు.. తామెలాంటి పరిస్థితులు డ్యూటీ చేయాల్సివచ్చిందో చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు ఎన్నో. ఇక వేలిపై పెట్టే సిరా అంటారా? దాన్ని చెరిపేసేందుకు ఎన్నో కెమికల్స్ రాజకీయనాయకులకు అందుబాటులోనే ఉంటాయి.

ఫిబ్రవరి 22న రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన జాబితా ప్రకారం.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో.. ఒక ఫోటో తో 5 ఓట్లు ఉన్నాయి.. టోటల్గా ఇలాంటి ఓట్లు ఒక లక్షా 25 వేల పైనే. ఓటర్ ల పేర్లు ఎలా ఉన్నాయో చూస్తే దిమ్మతిరిగింది.

ఓటర్ పేరు జ

ఆమె తండ్రి పేరు క

మరో ఓటర్ పేరు న

ఆమె భర్త పేరు ర

ఇలాంటి లక్షా పాతిక వేల ఓట్లు ఒక నియోజకవర్గంలో ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరుగుతుందని ఎలా భావించాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వీటికి ఎన్నికల సంఘం వద్ద సమాధానమే లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...