మొదటి దశ పోలింగ్ కు మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ సీనియర్ నేతలు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు తమ మేనిఫెస్టో ‘సంకల్స్ పత్ర’ను ఆవిష్కరించారు. 45 పేజీల మేనిఫెస్టోలో అన్నదాతలు, పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా బీజేపీ వరాల జల్లు కురిపించింది. నమో అన్నదాతా అంటూ రైతన్నను ఆకట్టుకునే హామీలు పొందుపరిచింది. మేనిఫెస్టో విడుదల అనంతరం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అందులోని విశేషాలను వెల్లడించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చినట్టు చెప్పారు. దాదాపు 6 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలిపారు. 2022లో 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయానికి దేశంలోని ప్రతి భారతీయుడి జీవితంలో చక్కని మార్పు తీసుకొచ్చే దిశగా 75 రకాల చర్యలు చేపడతామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది.
బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ…
-
కిసాన్ క్రెడిట్ కార్డుపై సున్నా శాతం వడ్డీతో రూ.లక్ష వరకు రుణం
-
60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పింఛను
-
కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏటా రైతులకు రూ.6వేల సాయం
-
వ్యవసాయం రంగానికి రూ.25 లక్షల కోట్ల కేటాయింపు
-
2022 నాటికి అన్నదాతల ఆదాయం రెట్టింపునకు చర్యలు
-
పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి
-
భూ రికార్డుల డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు
-
మత్స్యకారులకు అవసరమైన సదుపాయాల కల్పన
-
ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు
-
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు
-
గ్రామీణ పేదలకు ఎల్పీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్
-
ప్రతి పౌరుడికి బ్యాంకు ఖాతా
-
ప్రతి గ్రామపంచాయతీకి ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్
-
అన్నివర్గాల ఆమోదంతో రామ మందిర నిర్మాణం
-
పౌరసత్వ బిల్లు సవరణకు చర్యలు
-
2024 నాటికి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ లేదా పీజీ మెడికల్ కాలేజీ
-
ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య రెట్టింపు
-
లక్షన్నర ఆరోగ్య కేంద్రాల్లో టెలిమెడిసిన్, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీల ఏర్పాటు
-
మరో 50 నగరాల్లోకి మెట్రో నెట్ వర్క్
-
రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణానికి భారత్ మాలా 2.0 కింద సహకారం
-
దేశ భద్రతకు అధిక ప్రాధాన్యత
-
2024 నాటికి కొత్తగా 200 కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు
-
అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలక ఆయుష్మాన్ భారత్ పథకం
-
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
-
ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా బిల్లులకు ఆమోదం పొందేలా చర్యలు
-
వ్యాపారవేత్తలకు రూ.50 లక్షల వరకు రుణాలు
-
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ లో భారత ర్యాంకు మెరుగుపడేలా చర్యలు
-
ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీవ్రం
-
సైనిక దళాల బలోపేతానికి ఆయుధాల కొనుగోలు చర్యల వేగంవంతం
-
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుకు చర్యలు
-
ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లను నిరోధించేందుకు ఆధునిక సాంకేతికత వినియోగం
-
2022 నాటికి గంగానది శుద్ధికి చర్యలు.
543639 614712Basically a smiling visitor here to share the enjoy (:, btw wonderful style and design . 148327
7339 155880Ive read several excellent stuff here. Certainly value bookmarking for revisiting. I surprise how much effort you put to create 1 of these excellent informative site. 985560
181012 270151I truly enjoy examining on this site , it has good content material . 577154
469146 362022Definitely value bookmarking for revisiting. I surprise how a lot attempt you set to create one of these fantastic informative site. 5810