బిగ్‌బాస్‌లో సాదారణంగా శనివారం ఎపిసోడ్‌కు హోస్ట్ రావాలి, సందడి చేయాలి కంటెస్టెంట్స్ కు చిన్న చిన్న వార్నింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. కాని నిన్నటి ఎపిసోడ్లో మాత్రం అలా జరగలేదు. నాగార్జున షూటింగ్ నిమిత్తం మనాలీలో ఉన్నాడు. ఆ విషయాన్ని ఎపిసోడ్ ఆరంభంలో వేశారు. ఏడు నెలల తర్వాత షూటింగ్ కోసం వచ్చాను. 21 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే మొన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు అంతా కలిసి ప్రేమ మొదలైంది అనే సినిమాను తీశారు. ఆ సినిమా ప్రీమియర్‌ను నిన్నటి ఎపిసోడ్లో వేశారు. ప్రీమియర్‌తో పాటు అవార్డు వేడుక మరియు డాన్స్ లతో సందడి సందడిగా నిన్నటి ఎపిసోడ్ ను కంటెస్టెంట్స్ మార్చేశారు.
సినిమా ప్రీమియర్ కోసం వచ్చే గెస్ట్ లను అరియానా ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఒకొక్కరిని ఒక్కో విధంగా విసిగించే విధంగా ప్రశ్నలు అడిగి చివరకు మీకు బీబీ హౌస్ లో ప్రేమ మొదలైందా అంటూ ప్రశ్నించింది. పలువురు నవ్వుతూ లేదంటూ సమాధానం ఇవ్వగా మరికొందరు మాత్రం సిగ్గుపడ్డారు. మొత్తానికి బిబి హౌస్‌లో ప్రేమ కొందరిలో మొదలు అయినట్లుగానే అనిపించింది. సినిమా ప్రీమియర్ కోసం కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా విభిన్నమైన గెటప్స్ తో అందంగా తయారు అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
ప్రీమియర్‌కు సంబంధించి లాస్య మరియు సోహెల్‌లు హోస్టింగ్ చేశారు. ఇద్దరు కలిసి చేసిన ఎంటర్టైన్ మెంట్ ఆకట్టుకుంది. సినిమా ప్రీమియర్ ప్రారంభం అయిన తర్వాత ఇంటి సభ్యులు చాలా ఆసక్తిగా ఎంజాయ్ చేస్తూ చూశారు. సినిమాలో అవినాష్ మరియు మెహబూబ్ లు అద్బుతమైన నటన ప్రదర్శించారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా వారి నటన ఉంది. పల్లెటూరు వ్యక్తిగా అవినాష్, విలన్‌గా మెహబూబ్ కనిపించాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విభాగంలో అవార్డు దక్కింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ అంతా ఆట పాటలతో కంటెస్టెంట్స్ అల్లరితో సరదాగా సాగింది. ఇక నేటి ఎపిసోడ్ లో సమంత మూడు గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతుంది. దసరా సందర్బంగా సమంత హోస్టింగ్ గా సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు షో కొనసాగబోతుంది.
215703 635732I recognize there is a great deal of spam on this web site. Do you need to have aid cleaning them up? I may possibly assist in between courses! 366531
251519 202967But yet another intelligent weblog! Completely cannot wait for a whole lot much more! 914426
960166 702750There is noticeably a bundle to know about this. I assume you produced certain good points in attributes also. 26717
764665 561707I do not have a bank account how can I location the order? 309656
759219 643You got a extremely good web site, Gladiola I discovered it by means of yahoo. 861430
130274 790936Im having a bit concern I cant subscribe your feed, Im making use of google reader fyi. 221612