Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 15 – రక్తికట్టని ఫేక్‌ ఎలిమినేషన్‌ షో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

శనివారం ఎపిసోడ్‌ లో నాగార్జున ఎవరైతే ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారో వారందరిని ఒక ఉతుకు ఉతికేశారు. కనీసం పోరాటం చేయకుండా ఒకరి తర్వాత ఒకరు అంటూ బోట్‌ దిగడం ఏంటీ ఎలిమినేషన్‌ అంటే అత సీరియస్‌ లేకుంటే ఎందుకు గేమ్‌ లో ఉండటం అంటూ తీవ్రంగా కోప్పడ్డాడు. ఎలిమినేషన్‌ అంటే సీరియస్‌ నెస్‌ లేకపోవడం వల్లే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ నాగార్జున ప్రకటించాడు.

అన్నట్లుగా శనివారం ఎపిసోడ్‌ లో కరాటే కళ్యాణిని ఎలిమినేట్‌ చేసి ఆదివారం ఎపిసోడ్‌ లో చివరి వరకు సెకండ్‌ ఎలిమినేషన్‌ ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌ లో ఉంచారు. నిన్నటి ఉదయం నుండే సోషల్‌ మీడియాలో హారిక ఎలిమినేట్‌ అవ్వబోతుంది. అది ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ ప్రచారం జరిగింది. గత సీజన్‌ లో రాహుల్‌ ను ఎలా అయితే ఫేక్‌ ఎలిమినేట్‌ చేశారో అలాగే హారికను కూడా ఫేక్‌ ఎలిమినేషన్‌ చేస్తారంటూ ప్రచారం జరిగింది.

మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే దేత్తడి హారికనే ఎలిమినేషన్‌ చేస్తున్నట్లుగా నాగార్జున ప్రకటించి, బయటకు వెళ్తున్న సమయంలో అనూహ్యంగా స్టాప్‌ అంతా లోనికి వచ్చేయండి అంటూ నాగార్జున పిలవడంతో అందరికి ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ అర్థం అయ్యింది. అయితే అంతకు ముందు జరిగిన నాటకీయ పరిణామాలతో ఎలిమినేషన్‌ పక్రియ నిజం కాదనిపించింది. ఒకొక్కరు సేవ్‌ అవుతూ వస్తున్న సమయంలో చివరకు మోనాల్‌ మరియు హారికలు మిగిలి ఉన్నారు.

ఆ సమయంలో ఈసారి వీరిద్దరిలో ఒకరిని బయటకు పంపించేది ప్రేక్షకులు కాదు ఇంటి సభ్యులు అంటూ నాగార్జున ప్రకటించాడు. దాంతో అసలు విషయం క్లారిటీ వచ్చేసింది. ఇంటి సభ్యుల ఓటింగ్‌ తో అస్సలు ఎలిమినేషన్‌ ఉండదు. అప్పుడే చాలా మందికి అర్థం అయ్యింది ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని. దానికి తోడు ఏమాత్రం క్రేజ్‌ లేని సాయి మరియు సోహెల్‌ లు సేవ్‌ అయ్యారు.

ఇంట్లో ఉండవల్సిన వారు అయిన హారిక, మోనాల్‌ లు ఎలిమినేషన్‌ లో ఉండటం వల్ల కూడా ఎక్కువ శాతం మంది ఈ ఎలిమినేషన్‌ ను ముందే ఫేక్‌ అంటూ కనిపెట్టారు. బయటకు వెళ్లినా కూడా హారిక లోనికి వస్తుందనే ఎక్కువ మంది భావించారు. అందరు ఊహించినట్లుగానే ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ పక్రియ అవ్వడం వల్ల పెద్దగా రక్తి కట్టలేదు అని చెప్పుకోక తప్పదు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో ఎలాంటి వివాదాలు లేకుండా ఎలిమినేషన్‌ అయిన కళ్యాణితో కొద్ది సమయం మాట్లాడించి ఆ తర్వాత ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గేమ్‌ ఆడించారు. ఇక నేటి నుండి మాస్క్‌ లు తీసి అంతా ఎవరు ఎలా ఉంటారో అలా ఉండాలి అన్నట్లుగా నాగార్జున సూచించాడు. ఈ మూడవ వారం ఎలాంటి ట్విస్ట్‌ లతో బిగ్‌ బాస్‌ సాగుతుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...