Switch to English

బిగ్‌ స్టోరీ: విశాఖలో టాలీవుడ్‌.. మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమ చెన్నయ్‌ నుంచి హైద్రాబాద్‌కి రావడం కోసం చాలా ఎక్కువ సమయమే పట్టింది. నిజానికి, ఇంకా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు చెన్నయ్‌లోనే వుండిపోయారు. అక్కడి అనుకూలతలు, అవకాశాల కారణంగా చెన్నయ్‌ని వీడలేకపోతున్నామని పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికీ చెబుతుంటారు. ఎలాగైతేనేం, సినీ పరిశ్రమ హైద్రాబాద్‌లో నిలదొక్కుకుతంది.. పలువరు ప్రముఖులు ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకున్నారు.. స్టూడియోలు నిర్మించుకున్నారు.. ఇదంతా పాత కథే.

కానీ, విశాఖ పరిస్థితి ఏంటి.? రెండు మూడు దశాబ్దాల క్రితమే విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ వర్దిల్లేందుకు సమాలోచనలు జరిగాయి. రామానాయుడు లాంటోళ్ళు కొంత ముందడుగు కూడా వేశారు. అయితే, ఆ తర్వాత క్రమక్రమంగా విశాఖ మీద టాలీవుడ్‌ ఆశలు సన్నగిల్లాయ్‌. మళ్ళీ ఇప్పుడు.. ఇన్నాళ్ళకి విశాఖ వైపు సినీ పరిశ్రమ.. అన్న చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో టాలీవుడ్‌ పెద్దలు ఈ రోజు భేటీ అయ్యారు. చిరంజీవి నేతృత్వంలో నాగార్జున సహా పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమయిన విషయం విదితమే. ఈ సందర్భంలో ‘విశాఖలో సినీ పరిశ్రమ’ అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. గతంలోనే సినీ పరిశ్రమ కోసం భూములు కేటాయించబడ్డాయనీ, వాటిని అలాగే కొనసాగిస్తే.. అక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్‌ బృందం ముఖ్యమంత్రికి తెలిపింది.

ఇక, సినీ పరిశ్రమ ప్రస్తుత కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి సంబంధించి ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపైనా విన్నవించుకున్నారు సినీ పెదష్ట్ర&్దలు. తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలా అండగా వుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, చిరంజీవి బృందానికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయాలనే తలంపుతో వున్న జగన్‌ ప్రభుత్వం, విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ వర్దిల్లేందు కోసం కీలకమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోందట.

‘ఇప్పటికిప్పుడు హైద్రాబాద్‌ నుంచి సినీ పరిశ్రమ విశాఖకు తరలి వెళ్ళిపోతుందని అనడం కరెక్ట్‌ కాదు. కానీ, తెలుగు సినీ పరిశ్రమకు ఇంకో ఇల్లుగా విశాఖ మారాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు..’ అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఏదిఏమైనా, వైఎస్‌ జగన్‌ గనుక.. సినీ పరిశ్రమకు విశాఖలో అవసరమైన సౌకర్యాలు కల్పించగలిగితే.. అదొక చారిత్రాత్మకమైన నిర్ణయం అవుతుందన్నది నిస్సందేహం. సినీ పరిశ్రమ అంటే.. తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు చాలా చాలా కీలకం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. విశాఖలో టాలీవుడ్‌ వర్ధిల్లితే.. అప్పుడు విశాఖ నగరం కీర్తి పదింతలవుతుందన్నది నిస్సందేహం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...