Switch to English

జస్ట్ ఆస్కింగ్: భూమా.. ఇంత దిగజారుడుతనమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

భూమా కుటుంబం అంటే, కర్నూలు జిల్లాలో చాలా గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు వున్న కుటుంబం. కానీ, అదంతా గతం. ఇప్పుడు భూమా.. అనగానే, కబ్జాలు.. హత్యలు.. కిడ్నాప్‌లు గుర్తుకొస్తున్నాయ్. భూమా నాగిరెడ్డి.. ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి.. రాజకీయాలకు వన్నె తెచ్చారు. కుటుంబ గౌరవ ప్రతిష్టలు కాపాడాల్సిన భూమా అఖిల ప్రియ.. మొదటి నుంచి వివాదాల్లోనే నానుతున్నారు.

ఒకప్పడు ఆమె పట్ల సానుభూతి వుండేది.. కానీ, ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడమేంటి.? ఈ కేసులో ఆమె భర్త పరారీలో వుండటమేంటి.? అసలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అవడమంటే.. అంత సాహసం తెలంగాణ పోలీసులైనా ఎలా చేయగలిగారు.? ఇక్కడ సాహసం.. అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. కేసు అంత బలంగా లేకపోతే, ఆమెను అరెస్ట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు.

పైగా, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌లోనూ భూమా అభిమానులు కొందరున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులుగా చెప్పబడుతున్న ప్రదీప్ రావు మరికొందర్ని భూమా అఖిలప్రియ భర్త భరత్ రామ్ రెడ్డి కిడ్నాప్ చేయించాడన్నది ప్రధాన ఆరోపణ. ప్రదీప్ రావు అలాగే భూమా అఖిలప్రియ.. ఆమె భర్త భరత్ మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. అదే ఈ కిడ్నాప్ వ్యవహారానికి కారణంగా తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో కొన్నాళ్ళ క్రితం సొంత పార్టీకి చెందిన నేతనే హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నించారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఆ కేసు అలా వుండగానే, ఇప్పుడు భూమా అఖిలప్రియ ఇంకోసారి వివాదాల్లోకి ఎక్కారు.

ఎలాంటి కుటుంబం పరువు ఎంతలా దిగజారిపోతోంది.? అంటూ భూమా అభిమానులు వాపోతున్నారంటే.. ఆ స్థాయికి భూమా అఖిల ప్రియ తన కుటుంబ గౌరవాన్ని దిగజార్చేశారని నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ, ఎందుకిలా.? ఇదంతా రాజకీయ కుట్ర మాత్రమే.. అని అఖిలప్రియ చెప్పదలచుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...