Bala Krishna: చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్టుపై ఎన్టీఆర్ (Ntr) స్పందించలేదనే ప్రశ్నకు బాలకృష్ణ Bala Krishna) తనదైన శైలిలో సమాధానమిచ్చారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ కార్యకర్తలో సమావేశమైన అనంతరం విలేకరులో ఆయన మాట్లాడారు. దీంతో చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదని అడగ్గా.. ‘ఐ డోంట్ కేర్.. బ్రో ఐ డోంట్ కేర్.. నా తర్వాతి సినిమా. సినిమాలోనే కాదు.. బయట కూడా’ అని అన్నారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. సినీ పరిశ్రమ వారూ స్పందించకపోవడంపై కూడా తాను పట్టించుకోనని అన్నారు.
రోజా అంశంపై మాట్లాడుతూ.. ‘రోజాలాంటి వారిపై స్పందించటం కంటే మౌనంగా ఉండటమే మేలు. బురద మీద రాయి వేస్తే మన మీదే పడుతుంద’ని అన్నారు. తెలంగాణలో ఎన్నికలు వస్తూండటంతో కేవలం ఓట్ల కోసమే మూడు రోజుల నుంచీ ఎన్టీఆర్ నామజపం చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో అజ్ఞాతంలో ఉన్న టీడీపీ పుంజుకునే సమయం వచ్చింది. తప్పకుండా ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతుంది. తెలంగాణలో టీడీపీ లేదనే వారికి మేమేంటో చూపిస్తా’మని అన్నారు.