ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో వచ్చిన చిత్రం బేబీ. ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పది సినిమాలకు సరిపడా పేరుని అటు ఆనంద్ దేవరకొండ, ఇటు వైష్ణవి చైతన్య సంపాదించుకున్నారు.
ముఖ్యంగా వైష్ణవి చైతన్య కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను సూపర్బ్ గా పోషించింది. దీని తర్వాత అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బేబీ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ చిత్రానికి డ్యూయెట్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఇది కూడా యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.
కాకపోతే ఈసారి హీరోయిన్ ను కూడా పాజిటివ్ కోణంలోనే చూపించనున్నారు. మిథున్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. చాలా మంది హీరోయిన్లను ఆడిషన్ చేసాక చివరికి ఈ కపుల్ నే ఫైనల్ చేసారు.