Switch to English

ఏపీ వైసీపీదే: సీపీఎస్ సర్వే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమంటూ మరో సర్వే వచ్చింది. అసెంబ్లీ, లోక్ సభ రెండింటిలోనూ ఆ పార్టీ హవా కొనసాగుతుందని పేర్కొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ 121 నుచి 130 అసెంబ్లీ సీట్లతోపాటు 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) సర్వే వెల్లడించింది.

అధికార తెలుగుదేశం పార్టీకి 45 నుంచి 54 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని వివరించింది. సీపీఎస్ సంస్థ కు సర్వే నిర్వహణలో జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. 2009 నుంచి ఈ సంస్థ చేసిన సర్వేలన్నీ నిజమయ్యాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా సీపీఎస్ సంస్థ చెప్పిన విధంగానే వచ్చాయి.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 94 నుంచి 104 స్థానాలు వస్తాయని చెప్పగా.. ఆ పార్టీ 88 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. అలాగే మహాకూటమి 16 నుంచి 21 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పగా.. కాంగ్రెస్ 19, టీడీపీ 2 చోట్ల మాత్రమే గెలుపొందాయి. మిగిలిన సర్వేలన్నీ మహాకూటమికే అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. సీపీఎస్ ఒక్కటే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని పేర్కొంది.

అలాంటి సంస్థ ఏపీలో పరిస్థితి ఎలా ఉందనే అంశంపై రెండు దశల్లో ఈ సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి 17-21 మధ్య, మార్చి 27-31 మధ్య రెండు విడతలుగా దాదాపు 7.41 లక్షల శాంపిల్స్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించింది. ఈ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడైంది.

2014తో పోలిస్తే ఈ సారి వైసీపీకి 8 శాతం ఓట్లు అధికంగా వస్తాయని వివరించింది. గత ఎన్నికల్లో కేవలం 1.6 శాతం ఓట్లు తక్కువ రావడంతో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అయితే, ఈ సారి 8 శాతం ఓట్లు ఎక్కువ రానున్న నేపథ్యంలో సీట్లు కూడా భారీగా పెరుగుతాయని విశ్లేషించింది.

మొత్తమ్మీద వైసీపీ 48.1 శాతం ఓట్లతో 121 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని, తెలుగుదేశానికి 40.1 శాతం ఓట్లతో 45 నుంచి 54 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు 8 శాతం ఓట్లు వచ్చినప్పటికీ, సీట్లు మాత్రం ఒకటి లేదా రెండుకు మించి రావని స్పష్టంచేసింది.

ఇక కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని పేర్కొంది. విశ్వసనీయత విషయంలో కూడా జగన్ కు ఏకంగా 90 శాతం మంది ఓటేయగా.. చంద్రబాబు పట్ల కేవలం 10 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారని తెలిపింది. జగన్, కేసీఆర్, మోదీ ఒకటేనంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం జనాల్లో ఏమీ ప్రభావం చూపడంలేదని తేలినట్టు వివరించింది.

అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లలో పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం జనాల్లో ఉండటంతోపాటు జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది భావిస్తున్నట్టు సీపీఎస్ తాజా సర్వేలో వెల్లడైంది. ఇక ఎంపీ సీట్లలోనూ వైసీపీదే హవా అని తేలింది. ఆ పార్టీ 21 స్థానాలు సాధించి కీలకంగా మారుతుందని సర్వే పేర్కొంది.

తెలుగుదేశం పార్టీ 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వివరించింది. పసుపు కుంకుమ పథకం ప్రభావం డ్వాక్రా సంఘాల మహిళల్లో కాస్త కనిపిస్తోందని, దాదాపు 44 శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉండగా.. వైఎస్సార్ సీపీ పట్ల 45.2 శాతం మొగ్గు చూపుతున్నారని పేర్కొంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....