Switch to English

అభివృద్ధి నాస్తి.. అప్పులేమో జాస్తి.. ఏపీ నెంబర్ వన్ ఇలాగేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘అప్పులు ఎలా చెయ్యాలో చంద్రబాబు చూపించారు.. అభివృద్ధి ఎలా చెయ్యాలో మేం చూపిస్తాం..’ అంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ చెబితే జనం నిజమేననుకున్నారు. అభివృద్ధి ఎక్కడ.? అని బూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి ఇప్పుడు. కానీ, అప్పులు చేయడంలో మాత్రం చంద్రబాబుని మించిపోతున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. టీడీపీ హయాంలో జరిగిన అప్పుల్ని మించిపోయేలా అప్పులు చేసేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. గడచిన రెండు నెలల్లో సుమారుగా 30 వేల కోట్లు అప్పులు చేసిందంటూ లెక్కలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ లెక్కన సగటున ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తి మీదా రోజుకి 97 రూపాయల అప్పు భారాన్ని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం మోపుతోందంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అంచనాలు వేస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ మద్దతుదారులే కాదు, ఇతర విపక్షాలకు చెందిన మద్దతుదారులూ నినదిస్తున్నారు.

‘కరోనా వైరస్‌’ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘సాకు’గా చూపిస్తుండొచ్చుగాక. కానీ, అప్పులు ఇప్పుడు కొత్తగా మొదలైనవి కావు. ముఖ్యమంత్రి అవుతూనే ‘అప్పుల పర్వం’ షురూ చేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులు అలాంటివి మరి. చంద్రబాబు గ్రాఫిక్‌ మాయాజాలానికే పెద్దయెత్తున ఖర్చయ్యింది టీడీపీ హయాంలో. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు.. ‘చంద్రన్న’ సంక్షేమ పథకాలు.. ఇలా ఒకటేమిటి.? రాష్ట్రాన్ని నట్టేట్లో ముంచేశాయి. చంద్రబాబు పాలనలో వైఫల్యాల్ని చూసిన జనం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి 2019 ఎన్నికల్లో అధికారమిస్తే.. ‘అంతకు మించి’ వైఫల్యాల్ని ఇప్పుడు చవిచూడాల్సి వస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు’ తయారయ్యింది. ప్రభుత్వాలు అప్పులు చేయడం అనేది సర్వసాధారణం. కానీ, ఆ అప్పుల భారం మోసేదెవరు.? ఇంకెవరు, ప్రజలే. మరి, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే.. ఆ పబ్లిసిటీ క్రెడిట్‌ ఎవరికి దక్కుతుంది.? ఇంకెవరికి.. అధికారంలో వున్నోళ్ళకి.! సొమ్ము ఒకడిది.. సోకు ఇంకొకడిది అంటే ఇదే మరి.

‘దేశంలో ఆంధ్రప్రదేశ్‌ని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెడ్తాం..’ అని పదే పదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతుంటారు.. ఇప్పుడు కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి రోజువారీ లెక్కల్లో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో నిలబెట్టేశారు. ఔను, ఇప్పటిదాకా నెంబర్‌ వన్‌లో వున్న మహారాష్ట్ర ఈ రోజు రెండో స్థానానికి పడిపోతే, ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అప్పులోనూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరించడానికి బహుశా ఎక్కువ సమయం పట్టదేమో.! అభివృద్ధి నాస్తి.. అప్పులేమో జాస్తి.. ఇదేం పాలన బాబోయ్‌.. అని రాష్ట్ర ప్రజానీకం నెత్తీ నోరూ బాదుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నది నిర్వివాదాంశం.

అభివృద్ధి నాస్తి.. అప్పులేమో జాస్తి.. ఏపీ నెంబర్ వన్ ఇలాగేనా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...