ప్రధానంగా నారాయణ అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోన్న విషయం విదితమే. మొన్నీమధ్యనే పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఓ పెద్ద రాజకీయ ప్రసహనం నడిచింది. ఆ తర్వాత అంతా సైలెంటయిపోయారు. నారాయణ విద్యా సంస్థల అధిపతి, మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేయడం, ఆయన బెయిల్ మీద విడుదలవడం తెలిసిన సంగతులే.
ఇక, ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు సంబంధించి ర్యాంకుల్ని ఏ విద్యా సంస్థలపైనా ప్రచారం చేసుకుంటే కొరడా ఝుళిపిస్తామంటోంది వైఎస్ జగన్ సర్కారు. నిజానికి, చాలా మంచి నిర్ణయమే ఇది. విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ఇది తొలి మెట్టు మాత్రమే. ర్యాంకుల ద్వారా తమ సంస్థల్ని ప్రమోట్ చేసుకోవడానికి, ఆయా సంస్థలు లక్షల్లో కాదు, కోట్లల్లో ఖర్చు చేస్తున్నమాట వాస్తవం.
అదంతా, తిరిగి విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి వసూలు చేస్తాయి ఆయా విద్యా సంస్థలు. లిస్టులో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు అగ్రస్థానంలో వుంటే, మిగతా ప్రైవేటు విద్యా సంస్థలూ ఈ దోపిడీలో తమవంతు పాత్ర పోషిస్తూనే వున్నాయి.
నిజానికి, ఆయా విద్యా సంస్థల్లో అధికారికంగానో, అనధికారికంగానో రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు వాటాలుంటాయ్. ఇద బహిరంగ రహస్యం. అందుకే, ఆయా విద్యా సంస్థల ఆటలు అలా చెల్లుతున్నాయి. ఆరో తరగతి నుంచే రకరకాల ప్రోగ్రామ్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అడ్డగోలుగా ఫీజులు బాదేస్తున్నాయి ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు.
ర్యాంకుల ప్రకటన వద్దంటున్నారు సరే, ఆయా స్కూళ్ళలో ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టగలదా.? అలా చేస్తే, చాలామంది అధికార పార్టీ నేతల, విపక్ష పార్టీల నేతల ఆర్థిక మూలాలు దెబ్బతింటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక.. వీటి పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, చిత్తశుద్ధి వుంటే, ప్రైవేటు విద్యా సంస్థల్లో పీజుల నియంత్రణపై ఫోకస్ పెట్టగలగాలి. కానీ, అంత చిత్తశుద్ధిని పాలకుల నుంచి ఆశించగలమా.? అది ఆంధ్రప్రదేశ్లో అయినా.. తెలంగాణలో అయినా.. ఆశించడం వల్ల ప్రయోజనం లేదు.
343831 589043Im not certain exactly why but this internet website is loading incredibly slow for me. Is anyone else having this concern or is it a problem on my end? Ill check back later and see if the difficulty still exists. 323982
Greetings, good website you’ve in here. [url=http://telent.ussoft.kr/bbs/board.php?bo_table=free&wr_id=770843]Erfahrungsberichte über metoclopramide in Amsterdam[/url]
815262 307531We offer you with a table of all the emoticons that can be used on this application, and the meaning of each symbol. Though it may possibly take some initial effort on your part, the skills garnered from regular and strategic use of social media will create a strong foundation to grow your business on ALL levels. 408703