కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఏపీలోని సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్సులకు సంబంధించిన విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్సిడ్ చార్జీలకు డిసెంబర్ నెలలోపు ఎప్పుడైనా కట్టే సౌలభ్యాన్ని ఇచ్చింది. బ్యాంకు రుణాలకు సంబంధించి 50 శాతం మేర వడ్డీ రాయితీని కూడా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయం ధియేటర్ల యజమానులకు ఊరటనిచ్చేది కావడంతో ఆ రంగంలోని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ‘కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సినీ పరిశ్రమపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని ప్రశంసించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
My hearty thanks to Hon'ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021
122585 304283my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the most effective stuff 648051
851777 746271I appreciate you taking the time to talk about them with folks. 471407
248123 446781 Spot on with this write-up, I truly think this web site needs considerably far more consideration. Ill probably be once again to read a lot far more, thanks for that info. 892150