Switch to English

సమస్యలు, హింస నడుమ ఏపీలో భారీ పోలింగ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈవీఎంల మొరాయింపు, పలుచోట్ల హింస చోటుచేసుకున్నప్పటికీ పోలింగ్ మాత్రం భారీగానే నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 76.69 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 71.43 శాతం ఓటింగ్ నమోదుకాగా, పలు చోట్ల అర్ధరాత్రి 12.30 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది.

ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ అంచనాలను ఈసీ ప్రకటించింది. పూర్తి వివరాలు మధ్యాహ్నానికి వెల్లడించే అవకాశం ఉంది. కాగా, ఏపీ ఎన్నికల్లో ఈసారి హింసాత్మక సంఘటనలు అధికంగా చోటుచేసుకున్నాయి. ఈవీఎంలు కూడా చాలాచోట్ల మొరాయించాయి. ఎండ భయంతో ఉదయాన్నే ఓటు వేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. అయితే, చాలా కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాటిని సరిచేసి, పోలింగ్ మొదలుపెట్టేసరికి చాలా సమయం పట్టింది. చాలా కేంద్రాల్లో మూడు గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ మొదలైన కేంద్రాలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పలు చోట్ల ఈసీపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఈవీఎం మొరాయించింది. దీంతో ఆయన మధ్యాహ్నం మరోసారి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది.

ఇక గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి హింస కూడా చోటుచేసుకుంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలచోట్ల టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో జరిగిన ఘర్షణల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చింతా భాస్కరరెడ్డి మృతిచెందగా.. వైఎస్సార్ సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుంలో పోలింగ్‌ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రమణారెడ్డి మృతి చెందారు. ఈసారి జరిగిన ఎన్నికల హింసలో పలువురు అభ్యర్థులు కూడా గాయపడ్డారు.

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు, నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు, నరసరావుపేట వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కూడా గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా కురుపాం వైఎస్సార్ సీపీ అభ్యర్థి పుష్పశ్రావణి, ఆమె భర్త, అనుచరులపై టీడీపీ వర్గీయులు దాడి చేసి పాఠశాల భవనంలో నిర్బంధించారు. గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్వర్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఇలా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనలన్నీ పోలింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించారు.

అయితే, ప్రజలు సాయంత్రానికి పెద్ద సంఖ్యలో ఓటరు కేంద్రాలకు చేరుకున్నారు. 6 గంటల లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం ఉందని ఈసీ స్పష్టంచేయడంతో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు చాలామంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. శ్రీకాకుళంలో 72 శాతం, విజయనగరం-85, విశాఖపట్నం-70, తూర్పుగోదావరి-81, పశ్చిమ గోదావరి-70, కృష్ణా-79, గుంటూరు-80, ప్రకాశం-85, నెల్లూరు-75, కడప-70, కర్నూలు-73, అనంతపురం-78, చిత్తూరులో 79 శాతం పోలింగ్‌ నమోదైంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...