Switch to English

ఆంధ్రప్రదేశ్ తీరం వణుకుతోంది.. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ వుండదంతే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

మొన్నామధ్య నాసా ఓ అధ్యయాన్ని విడుదల చేసింది. అందులో భారతదేశంలోని కొన్ని తీర ప్రాంత నగరాలు సముద్రుడి ఆగ్రహానికి గురికాక తప్పదని తేల్చారు నిపుణులు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశం మాత్రమే కాదు, చాలా దేశాల్లో తీర ప్రాంతాలకు ముప్పు పొంచి వుందన్నది బహిరంగ రహస్యం.

రోడ్లపై వాహనాలు పెరుగుతున్నాయ్.. ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయ్.. చెప్పుకుంటూ పోతే, భూమి వేడెక్కిపోవడానికి మనిషి చెయ్యని పనంటూ లేదు. చెట్లను నరికేస్తున్నాం, అడవుల్ని నాశనం చేసేస్తున్నాం. దాంతో, మంచు వేగంగా కరిగిపోతోంది.. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. విశాఖ తీరానికి ముప్పు పొంచి వుందనే హెచ్చరికలు బయటకు రాగానే, అంతా తూచ్.. అంటూ కొన్ని రాజకీయ విమర్శలు తెరపైకొచ్చాయి. విశాఖ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ తీర ప్రాంత నగరమైనా, పట్టణమైనా, గ్రామమైనా సముద్రుడి దెబ్బకు విలవిల్లాడాల్సిందే.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. అంతలోనే, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ముందుకొస్తున్నాడు. పౌర్ణమి, అమావాశ్య సమయాల్లో ఇలాంటివి మామూలేనని కొందరు అభిప్రాయపడుతుండగా, సాధారణ రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఎందుకు తలెత్తుతోందన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

2 కిలోమీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్ళడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తీర ప్రాంతాల్లో పెరిగిపోతున్న పోర్టులు, అదే సమయంలో.. సముద్ర గర్భంలో చమురు అన్వేషణ, తీర ప్రాంతాల్లోంచి చమురు లాగేస్తూ, నేలని గుల్ల చేసేస్తుండడం, వీటికి తోడు చేపలు, రొయ్యల పెంపకం కోసం పచ్చని పాలాల్నీ, తీరానికి రక్షణ ఇచ్చే చెట్లనీ, మడ అడవుల్నీ నరికేస్తుండడం… ఇవన్నీ మానవ తప్పిదాలే.

నష్టం 70 ఏళ్ళలో జరగొచ్చని నాసా చెప్పింది. కానీ, మనం అంత ఆలస్యం చెయ్యం.. అందులో సగం వంతు సమయంలోనో, పావు వంతు సమయంలోనే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినదే కాదు.. యావత్ మానవాళిదీ ఈ సమస్య.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...