Switch to English

పీకల్లోతు అప్పుల్లో ఏపీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

విభజన నాటి నుంచే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ మరింత అప్పుల్లోకి కూరుకుపోతోంది. ఆశించినంత ఆదాయం లేకపోవడం, సంక్షేమ పథకాలకు భారీగా వెచ్చించడం వంటి పరిణామాలు ఏపీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. కేంద్రం నుంచి కూడా సరైన సహకారం లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోగా.. నెల నెలా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు తదితరాల చెల్లింపులకు ఆర్థికశాఖ అష్ట కష్టాలు పడుతోంది.

కొత్తగా సచివాలయ ఉద్యోగాల్లో చేరినవారికి ఇంకా వేతనాలు అందని పరిస్థితి ఉంది. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొనడం, రాష్ట్రంలోని పరిస్థితులతో ఆదాయం లేకపోవడంతో ఖజానా కటకటలాడుతోంది. అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ వస్తున్నారు. కానీ ఇవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నవే కాబట్టి అప్పు తేక తప్పని పరిస్థితి నెలకొంది.

దీంతో సర్కారు ఎడాపెడా అప్పులు చేసేస్తోంది. ఎంతవరకు అవకాశం ఉంటే అంత మేర రుణాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే ఇప్పటికే దాదాపు రూ.34వేల కోట్ల మేర అప్పు తెచ్చింది. ఇందులో ఒక్క నవంబర్ లోనే రూ.8500 కోట్లు రుణం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలు ఉండగా.. ప్రతినెలా అప్పు తేకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితులున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతినెలా దాదాపు రూ.8వేల కోట్లు తెచ్చినా మరో రూ.30 వేల కోట్లకు పైగా అప్పు చేయాల్సిందే. పైగా జనవరి నుంచి అమ్మఒడి పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరింత మొత్తం అవసరం ఉంది. అయితే, సర్కారుకు ఇక రూ.7వేల కోట్ల మించి రుణ పరిమితి లేదు. అంటే కిందా మీదా పడినా రూ.7వేల కోట్లు మాత్రమే అప్పు పుడుతుందన్నమాట. ఆ మొత్తంతో డిసెంబర్ నెట్టుకొచ్చినా.. మిగిలిన మూడు నెలల పరిస్థితి ఏమిటన్నది అయోమయంగా మారింది. ఈ పరిస్థితిని సీఎం జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...