Switch to English

మూడు ముక్కలాటకి ఏడాది: ఆంధ్రప్రదేశ్‌కి చావు దెబ్బ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

అమ్మకి తిండి పెట్టలేనోడు, పిన్నమ్మకి వడ్డాణం చేయిస్తానన్నాడట.! ఔను, ‘ఒకే రాజధాని – మూడు రాజధానులు’ వ్యవహారంలో అధికార పార్టీ తీరు ఇలాగే వుంది మరి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగించడం చేతకావట్లేదుగానీ, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌.. జ్యుడీషియల్‌ క్యాపిటల్‌.. అంటూ అధికార పార్టీ కట్టు కథలు చెబుతోంటే, రాష్ట్ర ప్రజానీకం ఎలా నమ్మేస్తున్నారో ఏమో.!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏంటి.? ఒక్క రాజధానికే దిక్కులేనప్పుడు, మూడు రాజధానుల నిర్ణామెలా సాధ్యం.? అన్న సోయ, కాస్తంతైనా రాష్ట్ర ప్రజల్లో లేకపోవడ నిజంగానే ఆశ్చర్యకరం. శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా.. రాష్ట్ర ప్రజలెవరూ, రాజధాని అనేది తమ ఆత్మగౌరవం అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేకపోతున్నారు. బహుశా, ఇంకా హైద్రాబాదే తమ రాజధాని అన్న భ్రమల్లో రాష్ట్ర ప్రజలు వున్నారేమో.!

చంద్రబాబు ఎలాంటి దిక్కుమాలిన రాజకీయం చేశారు.? అన్నది వేరే చర్చ. రాష్ట్రానికి రాజధాని వుండాలా.? వద్దా.? రాజధాని చుట్టూ ఏడాదిగా గందరగోళం చోటు చేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏడాదిగా రాష్ట్రానికి రాజధాని లేదు. కానీ, అలా జనం ఆలోచించడమే లేదు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఏడుస్తున్నారు, ఛస్తున్నారు.. మాకెందుకు.? అన్నట్టుంది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల తీరు.

పక్కోడికి నొప్పి వస్తే, ‘మాకేంటి సంబంధం’ అన్నట్లు వదిలేస్తున్నారుగానీ, రేప్పొద్దున్న అదే దెబ్బ తమకీ తగలబోతోందని ఎందుకు అనుకోవడంలేదో.! తనదాకా వస్తేనేగానీ తలనొప్పి సంగతి తెలియదన్నట్లు.. ఆ ముచ్చట అటు విశాఖకీ, ఇటు కర్నూలుకీ ఎదురైతే తప్ప.. అక్కడి ప్రజలకీ వాస్తవం తెలిసిరాదేమో.! ‘మూడు రాజధానులకు విపక్షాలు అడ్డుపడుతున్నాయి..’ అనే కుంటి సాకుని ముందుగా ప్లాన్‌ చేసుకుని, అధికార పార్టీ ఈ నాటకానికి తెరలేపిందని.. ఇటీవలి పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది.

రాజధాని అమరావతి నిర్మాణం అధికార వైసీపీకి చేతకాదు. అది ఓపెన్‌ సీక్రెట్‌. ఆ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అత్యంత వ్యూహాత్మకంగా మూడు రాజధానుల నాటకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రం అభివృద్ధి అనే సోయ ఎవరికీ లేకుండా పోయింది. అంటే అధికార పార్టీ ‘పాచిక’ పారినట్లేనన్నమాట.

కేవలం హైద్రాబాద్‌ నుంచే అత్యధిక శాతం ఆదాయం తెలంగాణకు వస్తోంది. చెన్నయ్‌ నుంచి తమిళనాడుకీ, బెంగళూరు నుంచి కర్నాటకకీ.. ఇలా చెప్పుకుంటే దాదాపుగా అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. చిన్నదో పెద్దదో.. రాజధాని అమరావతిని పూర్తి చేసి వుంటే, రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే నగరం అయి వుండేది.

చంద్రబాబు మీద కోపమా.? లేదంటే, రాష్ట్ర ప్రజల మీద కోపమా.? ఏమోగానీ, 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలనూ వైసీపీకి కట్టబెట్టడమే బహుశా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేసిన ఘోర తప్పిదమయి వుంటుంది. చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగని అన్యాయం బహుశా అమరావతి విషయంలో జరిగి వుంటుంది. చంద్రబాబు చేసిన తప్పిదానికి శిక్ష అనుభవిస్తున్నారు. అది ముగిసిపోయిన చరిత్ర. ఆ పేరు చెప్పి, రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో చావు దెబ్బ కొట్టడం అధికార వైసీపీకి అస్సలేమాత్రం సబబు కాదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...