Switch to English

అల్లు వారబ్బాయికి దర్శకుడు కావలెను.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కింది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండూ కాక, ‘ఐకాన్‌’ అనే సినిమా ఒకటి లైన్‌లో ఉంది. అన్నయ్య ఇంత బిజీగా ఉంటే, తమ్ముడు పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. నెక్స్ట్‌ ఏ సినిమా చేయాలి.? అనే కన్ఫ్యూజన్‌లో ఉన్న తమ్ముడి కోసం స్టైలిష్‌ స్టార్‌ చాలా బాధపడిపోతున్నాడట. తనకు అత్యంత సన్నిహితులైన కొందరు దర్శకులతో తన తమ్ముడికి కథ చెప్పాలని అడుగుతున్నాడట.

అలా ఓ యువ దర్శకుడు అల్లు శిరీష్‌ కోసం మంచి కథ సిద్ధం చేశాడనీ, అతి త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనుందని సమాచారమ్‌. సదరు దర్శకుడు అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. అయితే అల్లు అర్జున్‌ లాంటి హీరో సినిమాకి దర్శకత్వం చేసే ఛాన్స్‌ రావడం అంటే పెద్ద విషయమే. ఓ ప్రముఖ హీరో తిరస్కరించిన ఆ దర్శకున్ని అల్లు అర్జున్‌ చేరదీశాడు. ఇంతలా తనని అల్లు అర్జున్‌ ఆదరించాడు కాబట్టే, అతని కోసం అతని సూచన మేరకు శిరీష్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడట ఆ దర్శకుడు.

గీతా ఆర్ట్స్‌ పతాకరపై ఈ సినిమా రూపొందే అవకాశాలున్నాయి. దర్శకుడికీ, హీరోకీ భరోసా ఇచ్చే క్రమంలో స్వయంగా అల్లు అర్జున్‌ కూడా ఆ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటాడనీ అంటున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ ఏంటంటే అల్లు అర్జున్‌తో నటించిన ఓ హీరోయిన్‌ని ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎంపిక చేయబోతున్నారట.

ఇప్పటికే మేకోవర్‌ పరంగా, చాలా మారిపోయిన శిరీష్‌ తన కొత్త సినిమాలో ఇంకా కొత్తగా మేకోవర్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడనీ తెలుస్తోంది. అలాగే ఓ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని పెట్టుకుని సిక్స్‌ ప్యాక్‌ కోసం కసరత్తులు ప్రారంభించాడట. ఇదొక యాక్షన్‌ బేస్‌డ్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ అని వినికిడి. ఇటీవల శిరీష్‌ హీరోగా వచ్చిన ‘ఎబీసీడీ’ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. వాస్తవానికి ఈ సినిమాపై శిరీష్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే, మరో రెండు సినిమాల్నీ లైన్‌లో పెట్టడానికి ఈ అల్లువారబ్బాయ్‌ శత విధాలా ప్రయత్నిస్తున్నాడట. అందులో ఒకటి ప్రయోగాత్మక చిత్రం కావచ్చని సమాచారమ్‌.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...