Switch to English

రాహుల్‌కి గుడ్‌బై.. ప్రియాంకకు వెల్‌కమ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కొద్ది గంటల్లో కౌంటింగ్‌ షురూ అవుతుంది. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. దేశంలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎవరి ఆశలు నెరవేరుతాయ్‌.? ఎవరి అంచనాలు తల్లక్రిందులవుతాయ్‌.? ఇంకొద్ది గంటల్లోనే తేలిపోతుంది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. కాంగ్రెస్‌ మాత్రం అదంతా ట్రాష్‌ అంటోంది. ఈ ఎన్నికలు రాహుల్‌ గాంధీ రాజకీయ భవితవ్యానికి లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్యలాంటివి.

ప్రత్యక్షంగా రాహుల్‌ గాంధీకీ, నరేంద్రమోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అందరూ భావిస్తున్నారు. కాబట్టి, ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం రాహుల్‌ గాంధీకి. అయితే, సరిగ్గా ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీకి ప్రియాంకా గాంధీ రూపంలో అదనపు శక్తి వచ్చింది. ప్రియాంకా రాకతో కాంగ్రెస్‌ పార్టీకి ఊపు పెరిగిన మాట వాస్తవం. అయితే, రాహుల్‌కి మాత్రం ప్రియాంక రాకతో పెద్ద షాకే తగిలింది. రాజకీయాల్లో రాహుల్‌ కంటే, ప్రియాంకా బెటర్‌ అనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఈ సారి సత్తా చాటకపోతే, రాహుల్‌ని తప్పించి, ఆ స్థానంలో ప్రియాంకాని కూర్చోబెట్టాలని సోనియా భావిస్తున్నారట.

అయితే, రాహుల్‌ మాత్రం ప్రియాంకా తనకు పోటీ కాదని పలు సందర్భాల్లో చెప్పారు. ప్రియాంకా కూడా తన సోదరుడికి సాయంగా ఉంటాననీ, ఆయనకు పోటీగా రాజకీయాలు చేయబోననీ స్పష్టత ఇచ్చారు. రాహుల్‌, ప్రియాంకా ఏం చెప్పినా అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకత్వం అవసరం. ఆ బలమైన నాయకత్వం తాలూకు లక్షణాలు రాహుల్‌ కంటే, ప్రియాంకాలో ఎక్కువగా ఉన్నాయి. నాయనమ్మ ఇందిర రూపం ప్రియాంకాకు ఎక్స్‌ట్రా బోనస్‌. వాగ్ధాటి, ధైర్యంగా జనంలోకి చొచ్చుకుపోయే తత్వం, ఇవన్నీ రాహుల్‌ కంటే, ప్రియాంకా రెండు మెట్లు పైన నిల్చునేలా చేశాయి. కాబట్టి, ఫలితాలు ఎలా ఉన్నా, కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంకానే అత్యున్నత పదవిలో చూడాలనుకోవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...