Allu Arjun: ఢిల్లీ (Delhi) లో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu Arjun) అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
‘జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాకు ఇంతటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీ, మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వానికి ధన్యవాదలు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా విజయానికి ఆయనే కారణం. ఈ అవార్డు నేను సాధించిన గొప్ప విజయమే కాదు.. మన సినిమాను ఆదరిస్తూ.. ప్రోత్సహిస్తున్న వారందరికీ చెందుతుంద’ని అన్నారు.
తనతోపాటు ఉత్తమ నటి అవార్డును సంయుక్తంగా అందుకున్న అలియా భట్, కృతిసనన్ తో కలిసిన ఫొటోలను పంచుకున్నారు. ‘ఇవి ఎంతో సంతోషకరమైన క్షణాల’ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తోపాటు భార్య స్నేహ, తండ్రి అల్లు అరవింద్ పాల్గొన్నారు. అలియా భట్ తన పెళ్లి చీరలో మెరిసిపోయారు.
Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the… pic.twitter.com/moX9e0hTSy
— Allu Arjun (@alluarjun) October 17, 2023