Switch to English

నిన్నటి వరకు జేజేలు.. ఇకపై ధూమ్ ధామ్ లు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రావాలి జగన్ … కావాలి జగన్… ఈ పాట ఆంధ్రప్రదేశ్ లో ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లదు. ఈ సాంగ్ తో పాటుగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లపాటు ఓదార్పు యాత్ర, పాదయాత్ర పేరుతో పర్యటించారు. ఇలా పర్యటనలు చేయడంతో… జగన్ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొని తన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతూ మంచి సీఎం అనిపించుకోవాలని పాపం తెగ తాపత్రయపడ్డారు. సరే పోనీలే అంతగా తాపత్రయపడుతున్నారు కదా అని ప్రజలు కూడా మంచి సీఎం అని పొగడటం మొదలుపెట్టాడు. ఇలా ప్రతి ఒక్కరు పొగడటం వలన అనుకుంటా పాపం పొగరు తలకెక్కింది. ఇది సహజమే.

తాము ఏం చేసినా ప్రజలు అంగీకరిస్తారు అనే మాట మనసులో పడిపోయింది అంటే చేసే పనులు కూడా అలానే ఉంటాయి. అందుకు ఓ ఉదాహరణ కేంద్రంలోని బీజేపీ. కేంద్రంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలను ఇప్పుడు ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో చూస్తూనే ఉన్నాం.

ఇదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కూడా అవలంబిస్తోంది. ఉన్న రాజధానిని అలా ఉండనివ్వకుండా… తేనెతుట్టెను కదిపినట్టుగా కదిపింది. అసలే రైతులు రాజదాని కోసం భూములు ఇచ్చి ఉన్నారు. ఆ భూములకు సంబంధించిన అభివృద్ధి ఒక్క ఇంచేకూడా జరగలేదు.

రైతులకు బాబు వెన్నుపోటు పొడిచాడు అనుకుంటే.. జగన్ ఉన్న రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారుస్తున్నట్టు ప్రకటించి ముందు నుంచి పోటు పొడిచాడు. రైతుల ప్రభుత్వం అని చెప్తూనే రైతుకు పోటు పొడవడంతో పాపం దిక్కుతోచక రోడ్డుపై పడ్డారు. భూములు ఇచ్చిన ఒక్క టీడీపీ రైతులే కాదు. అటు వైకాపా రైతులు కూడా భూములు ఇచ్చారు. తమ ఆర్ధిక పరిస్థితిపై దెబ్బకొడితే ఎవరైనా ఎలా చూస్తూ ఊరుకుంటారు.

ముందు తాము బాగుంటేనే పార్టీ గురించి ఆలోచిస్తారు. తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అధికారంలో ఎవరంటే ఏంటి… అని రోడ్డుపైకి వస్తారు. జేజేలు పలికిన నోటితోనే వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరి ఈ రైతులను ప్రభుత్వం ఎలా శాంతింపజేస్తుందో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...