మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ టాలీవుడ్ లో హీరోగా నిదొక్కుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఇప్పటికే చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాల పాలవుతూ .. ఒకటో, రెండో సినిమాలు యావరేజ్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా సక్సెస్ ఫుల్ ఫార్ములాతో ఏబిసిడి అంటూ మరో సినిమా చేసాడు. ఇతర భాషలో హిట్టయిన సినిమాకు ఇది రీమేక్. అయినా సరే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అసలు ఓపెనింగ్స్ నీరసంగా ఉన్నాయి. కనీసం మెగా ఫాన్స్ ఫోకస్ కూడా పెట్టనట్టుంది. అందుకే ఓపెనింగ్ వసూళ్లు మరి దారుణంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.
కొత్త దర్శకుడు సంజీవి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముంది భారీగా పబ్లిసిటీ చేశారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని చెప్పాడు శిరీష్. కానీ రిలీజ్ తరువాత పరిస్థితి తారుమారైంది. ఎక్కడ కొత్తదనం లేని కథ, కథనం అంటూ ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. మొదటి రోజు ఈ సినిమాకు కేవలం 2. 25 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అందులో షేర్ గా తీసుకుంటే ఆంధ్రా,తెలంగాణ కలిపి – 1. 16కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
నిజంగా ఈ విషయాల్లో అల్లు శిరీష్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. మెగా ఫ్యామిలీ సపోర్ట్, మెగా ఫాన్స్ అండ ఉన్న ఈ హీరోకే ఇంత దారుణమైన వసూళ్లు వస్తాయని ఎవరు ఉహించి ఉండరు. ఇక సినిమా, నటన పరంగా చూసుకున్నా అల్లు శిరీష్ లో మొనాటని వచ్చేసిందని అంటున్నారు. ఎక్కువగా అల్లు అర్జున్ ని కాపీ కొడుతున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో అల్లు శిరీష్ ఈ ప్రయత్నం కూడా వర్కవుట్ కానట్టే. అమెరికన్ దేశి .. కన్ఫ్యూజ్డ్ దేశిగా వచ్చిన శిరీష్ .. దేశి మెన్ అఫ్ కన్ఫ్యూజ్డ్ బాక్స్ ఆఫీస్ అని చెప్పాలి.
132192 266756Id have to speak to you here. Which isnt something Which i do! I enjoy to reading a post that ought to get men and women to believe. Also, thank you for permitting me to comment! 432935