న్యాచురల్ స్టార్ నాని హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటాడు. కరోనా కారణంగా నాని సినిమాల రిలీజ్ లలో తేడా వచ్చింది కానీ లేదంటే ఏడాదికి 2 లేదా 3 చిత్రాలు కచ్చితంగా అందిస్తాడు నాని. ఇటీవలే డైరెక్ట్ ఓటిటిలో నాని నటించిన టక్ జగదీష్ విడుదలైన విషయం తెల్సిందే.
అలాగే నాని అంటే సుందరానికి షూట్ ను దాదాపు పూర్తి చేసేసాడు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. ఇక దసరా సందర్భంగా నాని తర్వాతి చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు దసరా అనే టైటిల్ ఫిక్స్ చేసారు. హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరుని కన్ఫర్మ్ చేసారు.
అయితే రీసెంట్ గా ఈ విషయంలో రూమర్స్ వచ్చాయి. కీర్తి సురేష్ స్థానంలో సమంతను తీసుకున్నారని వార్తలు షికార్లు చేసాయి. అయితే ఇవి ఒట్టి పుకార్లేనని సమాచారం. సమంతను అసలు కన్సిడర్ చేయలేదట. కీర్తి సురేష్ అగ్రిమెంట్ సైన్ చేయడమే కాకుండా అడ్వాన్స్ కూడా పుచ్చుకుందిట.
81873 466086Hello! Nice post! Please do maintain us posted when we can see a follow up! 233528