Switch to English

నాగశౌర్య ‘వరుడు కావలెను’ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow
Movie వరుడు కావలెను
Star Cast నాగ శౌర్య, రీతూ వర్మ,
Director లక్ష్మీ సౌజన్య
Producer సూర్యదేవర నాగవంశీ
Music విశాల్ చంద్రశేఖర్, థమన్
Run Time 2 hr 15 Mins
Release అక్టోబర్ 29, 2021

నాగ శౌర్య హీరోగా నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చాయి. కాని ఈ సినిమా మాత్రం చాలా నమ్మకంను మోసుకు వచ్చింది. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు లేడీ డైరెక్టర్‌ లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. ఆమె ఈ సినిమాను ఎలా తీశారు.. కనీసం శౌర్యకు ఈ సినిమా అయినా సక్సెస్ ను అందించిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

భూమి(రీతూ వర్మ) ఒక స్ట్రాంగ్ లేడీ. కాస్త పొగరుబోతు అమ్మాయి కూడా. తనకు తాను సొంతంగా ఒక స్టార్టప్‌ ను రన్‌ చేసుకుంటూ ఉంటుంది. మరో వైపు విదేశాల్లో ఆర్కిటెక్చర్ గా ఆకాష్‌(నాగశౌర్య) పని చేస్తూ ఉంటాడు. భూమి కి చెందిన భవన నిర్మాణ సంస్థతో కలిసి వర్క్‌ చేసేందుకు ఆకాశ్ ఇండియాకు వస్తాడు. అతడు భూమి తోనే ఎందుకు కలిసి వర్క్ చేయాలనుకున్నాడు..? వీరిద్దరి మద్య జరిగేదేంటీ అనేది ఈ సినిమా కథ.

నటీనటులుః

నాగ శౌర్య ఆకాష్ పాత్రకు జీవం పోషినట్లుగా అనిపించాడు. చాలా స్టైలిష్‌ గా మ్యాన్లీగా ఆకట్టుకున్నాడు. అతడి డ్రస్సింగ్‌ స్టైల్‌ మరియు ఇతర విషయాలతో అతడు పూర్తిగా ఆకట్టుకున్నాడు. సినిమాకు పూర్తి న్యాయం చేసే విధంగా నటించాడు. నటన పరంగా కూడా నాగ శౌర్య గతంతో పోల్చితే చాలా మెరుగు పడ్డట్లుగా అనిపించింది. రీతూ వర్మ మంచి నటనతో మెచ్చుకుంది. ఆమె లుక్ కూడా ఒక పొగరుబోతు అమ్మాయి మాదిరిగా బాగుంది. ఆమె చీర కట్టులో చాలా అందంగా హుందాగా కనిపించింది. భూమి పాత్రకు రీతూ వర్మ సూపర్‌ సెట్‌ అయ్యింది. హీరో హీరోయిన్ మద్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా వాటికి జీవం పోసినట్లుగా నటించారు. ఇక కీలక పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణులు:

సినిమాకు విశాల్ చంద్రశేఖర్‌ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ ఇచ్చింది. పాటలు సినిమాకు మంచి అంశంగా నిలిచాయి అనడంలో సందేహం లేదు. కథ మరియు కథనం అనుసారంగా అతడి బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో మనం ఉండి చూస్తున్నంత రియాల్టీ ఫీల్ కలిగింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా సింపుల్‌ గా క్యాచీగా అర్థం అయ్యే విధంగా ఉండటంతో పాటు కథానుసారంగా బాగున్నాయి. ఇక దర్శకురాలిగా ఈ సినిమా తో పరిచయం అయిన సౌజన్య మంచి కథను ఎంపిక చేసుకున్నారు. ఆమె ఈ కథపై చాలానే వర్కౌట్స్ చేసినట్లుగా అనిపిస్తుంది. మంచి భవిష్యత్తు ఉన్న దర్శకురాలు అనిపిస్తుంది. వరుడు కావలెను కథ మరియ స్క్రీన్‌ ప్లేను ఆమె బ్యాలన్స్ చేస్తూ ఆకట్టుకున్న విధానం చాలా బాగుంది.

ప్లస్ పాయింట్స్:

  • హీరో హీరోయిన్ మద్య వచ్చే సన్నివేశాలు
  • సంగీతం.

మైనస్‌ పాయింట్స్‌ః

  • స్లో కథనం,
  • కథలో స్ట్రాంగ్‌ పాయింట్స్ ఉండాల్సింది.

విశ్లేషణ:

వరుడు కావలెను ఒక ఎంటర్‌ టైనర్‌. హీరో హీరోయిన్ మరియు ఇతర నటీనటులు నటించిన తీరు మరియు వారి మద్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మీరు టైమ్ పాస్ కోరుకుంటే ఖచ్చితంగా ఒక సారి చూసి ఎంటర్ టైన్ అవ్వడంతో పాటు మంచి టైమ్‌ పాస్ కూడా. భారీ అంచనాలు పెట్టుకుని వెళ్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు.

రేటింగ్ః 2.75/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...