Switch to English

రాశి ఫలాలు: సోమవారం 04 అక్టోబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:48
తిథి: భాద్రపద త్రయోదశి రా.7:22వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: ఇందు వాసరహ (సోమవారం)
నక్షత్రము: పుబ్బ,రా.2:26 వరకు తదుపరి ఉత్తర
యోగం: శుభం ఉ.2:26 వరకు తదుపరి శుక్లo
కరణం: గరజి ఉ.7:35 వరకు
వర్జ్యం: ఉ.10:21 నుండి 11:57 వరకు
దుర్ముహూర్తం: ఉ.12:10నుండి 12:57 వరకు తదుపరి మ.2:20 నుండి 3:17 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:33నుండి మ.3:01 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:34 నుండి తె.5:22 వరకు
అమృతఘడియలు: ఉ.8:24 నుండి 9:57 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:41 నుండి మ.12:28 వరకు

రేపు (04-10-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.

మిధునం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర హారాలు ఉండవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు . దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

సింహం: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు.

కన్య: దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

తుల: పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపార,ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు: నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం: చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరో బాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం: ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలలో వాయిదా పడతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.

మీనం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...